కరోనా నుంచి కోలుకున్న విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన కోలుకొని 10 రోజుల తర్వాత ట్వీట్ చేశారు.
‘భగవంతుడి భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను’అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇక మరో ట్వీట్ లో తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మిత్రులు, శ్రేయోభిలాషులు.. వైద్యం అందించిన డాక్టర్లు.. తనపై ప్రేమ చూపించిన అందరికీ ధన్యవాదాలు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నారు.