దుర్గ గుడి అక్రమాల లెక్క తెలుస్తోన్న విజిలెన్స్ ఆఫీసర్స్ .. !
బెజవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ ఆలయంలో ఈ మధ్య తరచుగా ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఫిబ్రవరి నెలలో దుర్గగుడికి సంబంధించిన జమ్మిదొడ్డి లోని ఆలయ పరిపాలన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి దుర్గగుడి పరిపాలనలో అనేక కీలక విభాగాలలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. గతంలో జరిగిన ఏసీబీ తనిఖీల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా బుధవారం నాడు నిర్వహించిన సోదాల్లో విజిలెన్స్ అధికారులు లడ్డు ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు ఉన్నట్టు, దుర్గమ్మ చీరలు విక్రయాలలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
ఆలయ ఈవో సురేష్ బాబు తన సొంత నిర్ణయంతో అమ్మవారి చీరలు విక్రయించినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంతేకాదు అన్నదాన కాంట్రాక్ట్ లో సైతం అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కనకదుర్గ ఆలయంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారుల సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ విభాగంలో, టోల్ టికెట్లు, చీరల విభాగాలలో సోదాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆలయానికి సంబంధించిన కీలక విభాగాలను భారీగా అక్రమాలు గుర్తించడంతో ప్రతి ఫైల్ ను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
గర్భగుడి కాంట్రాక్టు ఉద్యోగస్తుల బదిలీల వ్యవహారం పై కూడా ఆరా తీయనున్నారు. కనకదుర్గ ఆలయానికి సంబంధించిన సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై విజిలెన్సు ఫిర్యాదులు అందడంతో ప్రస్తుతం ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా చర్చ జరుగుతుంది. దుర్గగుడి లో పనిచేస్తున్న కీలక ఉద్యోగస్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు అవినీతికి పాల్పడి పట్టుబడగా..తాజా తనిఖీలతో ఇంకా మరెంత మంది అవినీతి అధికారుల గుట్టు రట్టు అవుతుందో అని రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.