సెక్స్ అంటే భయపడిపోతున్న వెనిజులా ప్రజలు.. ఎందుకంటే !
శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. దాంపత్య జీవితానికి సగం బలం ఈ శృంగారం. కానీ , ప్రస్తుత రోజుల్లో శృంగారం అనేదానికి అర్థమే మారిపోయింది. ఆ విషయం కాసేపు పక్కన పెడితే ..శృంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి ...కానీ , వెనిజులా ప్రజలు మాత్రం ఇప్పుడు శృంగారమంటేనే భయం తో వణికి పోతున్నారు. దానికి కారణం వారు కనీసం ఒక కండోమ్ ని కొనలేని స్థితిలో ఉండటమే. వారికీ ఒక్క కండోమ్ కొనుక్కుని కోరికలు తీర్చుకోవాలన్నా కూడా , ఆ కండోమ్ ధర చూసి ఆ సెక్స్ కోరికలని కూడా చంపుకొని బ్రతుకుతున్నారు. దీనితో పాటుగా హోటళ్లలో గడిపేందుకు, గర్భనిరోధక మాత్రలని కొనడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. అసలు ఒక కండోమ్ ధర ఎంత ఉంటుంది , దానికోసం శృంగారం పై ఉండే కోరికలని చంపుకొని బ్రతుకుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, వెనిజులాలో ఉన్న ప్రస్తుత పరిస్థతుల గురించి తెలుసుకోవాల్సిందే ...
ప్రస్తుతం వెనిజులాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీనితో ఆ దేశంలో పేద ప్రజల జీవనం మరింత భారంగా మారింది. కనీసం చిన్ని అవసరాలను కూడా నెరవేర్చుకోలేక దయనీయ స్థితిలో జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. AFP కథనం ప్రకారం వెనిజులాలో మూడు కండోమ్‌ల ప్యాకెట్ 2 డాలర్లు (రూ.142). నెలకు సరిపడా గర్భనిరోధక మాత్రలు 8 డాలర్లు (రూ.570). కరాకాస్ లో ఆరు గంటలు హోటల్ లో గడపాలంటే 10 డాలర్లు (రూ.713) వెచ్చించాలి. అక్కడి ప్రజలు సంపాదించే కనీస జీతం 6 డాలర్లు (రూ.428) కంటే వీటి విలువ చాలా ఎక్కువ.
వారి రోజు జీతం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రజలు వేరు కాపురాలకు బదులు ఉమ్మడిగా జీవిస్తున్నారు. కుటుంబం అంతా కలిసి ఒకే గదిలో నివసిస్తున్నారు. దీనితో వారికీ కాసేపు ఏకాంతంగా గడిపేందుకు కూడా ఛాన్స్ లేదు. ఇంట్లో కాకపోతే , కనీసం హోటల్ లో రూమ్ తీసుకోని కాసేపు ఏకాంతంగా ఉండాలంటే , అంత డబ్బును కట్టలేని పరిస్థితి. ఒకవేల కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు లేకుండా సెక్స్ చేస్తే పిల్లలు పుడతారని, వారిని పోషించడం తమకు మరింత భారం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.ఈ కారణంతో వెనిజులా ప్రజలలో ఎక్కువ శాతం మంది సెక్స్ లేకుండానే జీవితాన్ని సాగిస్తున్నారు. అక్కడ గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆర్థిక సంక్షోభం తో వెనిజులా లో సంపన్నులు, విద్యా వంతులు వేరే దేశాలకు వలస పోతున్నారు.