నామినేషన్ వేయకుండానే వెనుదిరిగిన వాణి దేవి... అసలు కారణం ఇదే ?

Update: 2021-02-22 17:30 GMT
పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమైన టీఆర్ ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. సోమవారం రోజు  హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సురభి వాణిదేవి జీహెచ్ ఎం సీ కార్యాలయానికి వచ్చారు. ఆమె నామినేషన్‌ ను పరిశీలించిన ఎన్నికల అధికారులు, నామినేషన్ ఫారం సరైన ఫార్మాట్‌ లో లేదని చెప్పి స్వీకరించలేదు. 4 గంటల పాటు రిటర్నింగ్ కార్యాలయంలోనే వాణీదేవి వేచి ఉన్నా ఫలితం లేకపోయింది. నామినేషన్ల స్వీకరణ సమయం అయిపోవడంతో ఆమె వెనుదిరగక తప్పలేదు.

మంగళవారం నాడు ఆమె తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. కాగా, రేపు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ఆమె చివరి రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.  దీనికి ముందు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ –రంగారెడ్డి– హైద‌రాబాద్ ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారవు కుమార్తె సురభి వాణిదేవిని ముఖ్యమంత్రి ఖరారు చేసిన విషయం తెలిసిందే.

 ఆ మేరకు బీఫారం ను కూడా ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని వాణీదేవి గెలుపు కోసం పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక  సీఎం కేసీఆర్ చేతుల బీపారం ను అందుకున్న వాణిదేవి.. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి నేరుగా నెక్లెస్ రోడ్డునులోని పీవీ ఘాట్ ‌ను వెళ్లారు. ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం గన్‌ పార్క్ ‌కు చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
Tags:    

Similar News