రౌడీల కాల్పులు.. డిప్యూటీ ఎస్సీ సహా 8మంది పోలీసులు మృతి

Update: 2020-07-03 04:15 GMT
ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అరాచకాలు ఎక్కువ అని మనం పేపర్లో, టీవీల్లో చూశాం. ఈ మధ్య కాస్త కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో కాస్త తగ్గినా ఆ మూకల దారుణాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. రౌడీ మూకల కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు మరణించడం కలకలం రేపింది. అందులో ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉండడం తీవ్ర కలకలం రేపింది. యూపీ పోలీస్ శాఖ ఉలిక్కిపడింది.

రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై రౌడీమూకలు కాల్పులు జరిపాయి. ఈ ఘటన లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా తో సహా 8 మంది పోలీసులు మృతి చెందడం తీవ్ర సంచలనమైంది. సమాచారం అందుకున్న ఎస్పీ అండ్ ఐజీ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుల కోసం వెతుకుతున్నారు.
Tags:    

Similar News