ట్రంప్.. బైడెన్ గురించి విని ఉంటారు.. ఈమె గురించి విన్నారా?
మన దేశంలో మాదిరి అమెరికాలో బోలెడన్ని పార్టీలు ఉండవు. అక్కడ రెండు పార్టీలే ప్రధానమైనవి. రిపబ్లికన్లు.. డెమొక్రాట్లు. రిపబ్లికన్లు అంటే.. ట్రంప్ ప్రాతినిధ్యం వహించేది.. డెమొక్రాట్లు అంటే జో బైడెన్ కు చెందింది. తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే.. ఈ ఇద్దరే కాదు.. మరో మహిళ కూడా బరిలో ఉన్నప్పటికీ ఆమె ప్రభావం తక్కువ కావటంతో మీడియా ఆమెను ఫోకస్ చేసింది తక్కువనే చెప్పాలి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రోజున అమెరికా ఎన్నికలు ఇంత పోటాపోటీగా.. ఉత్కంటకు కారణం ఏమన్నది చూస్తే.. ఈమె పేరే చెబుతారు.ఇంతకీ ఆమె ఎవరంటే.. లిబర్టేరియన్ పార్టీ తరఫున పోటీ చేసిన 63ఏళ్ల జో జొర్గెన్ సన్. సైకాలజీ సీనియర్ ప్రొఫెసర్ గా పని చేసే ఆమె.. తాను గెలవనప్పటికీ.. ప్రధాన అభ్యర్థుల గెలుపు అవకాశాల మీద మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించారని చెప్పాలి. జార్జియాలో ఆమెకు 61వేల ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లకు పట్టు ఉన్న జార్జియాలో వచ్చిన ఈ ఓట్లు ట్రంప్ కు దెబ్బేసినట్లుగా చెబుతున్నారు. ఆమెకు వచ్చిన ఓట్లు పుణ్యమా అని.. ఈ రాష్ట్రంలో బైడెన్ అధిక్యతలోకి రావటానికి అవకాశం కలిగిందని చెప్పాలి.
ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు.. విస్కాన్సిన్.. మిషిగన్.. నెవడాల్లో ట్రంప్.. బైడెన్ మధ్య అధిక్యత తక్కువగా ఉండటానికి.. పోటాపోటీ పోటీకి ఆమె కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఆమెకు పడిన ఓట్లు రిపబ్లికన్లకు పడాల్సినవని.. అందుకు భిన్నంగా ఆమెకు ఓట్లు వేయటంతో బైడెన్ అవకాశాలు మరింత మెరుగైనట్లుగా చెబుతున్నారు. విదేశాలతో యుద్ధాలు వద్దని.. అక్కడ పోరాటాలు చేస్తున్న అమెరికన్ సైనికుల్ని స్వదేశానికి తిరిగి తెప్పించాలన్న ప్రచారం పలువురిని ఆకర్షిస్తోంది. అంతేకాదు.. రిపబ్లికన్లు.. డెమొక్రాట్లు ఇద్దరు ఇద్దరేనని.. వారి వల్ల అమెరికాలో ఎలాంటి మార్పు రాదన్న మాటను జో జొర్గెన్ సన్ వర్గీయులు వ్యాఖ్యానిస్తుంటారు.