ఆధిక్యంలో దూసుకుపోతున్న బైడెన్​..తొలి ప్రసంగం కోసం అమెరికన్ల నిరీక్షణ..రగిలిపోతున్న ట్రంప్​

Update: 2020-11-07 04:15 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్​ పోల్స్​లో చెప్పినట్టుగానే వస్తున్నాయి. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఫలితానికి ఇక కొద్దిదూరంలోనే ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన గెలిచినట్టు ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో జో బైడెన్​ అధ్యక్షుడిగా గెలుపొందాక ఏం మాట్లాడతారని అమెరికా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రంప్‌పై బిడెన్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో బిడెన్ స్పష్టమైన  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమెరికాలో 538 ఎలక్టొరల్ ఓట్లు ఉండగా.. అధికారం చేపట్టేందుకు 270 సీట్లు కావాలి. బిడెన్ 264 స్థానాలతో లీడ్‌లో కొనసాగుతున్నారు. దీనికి తోడు జార్జియా, పెన్సిల్వేనియాలో కూడా ఆధిక్యంలో ఉన్నారు.

ట్రంప్ మాత్రం 214 సీట్లతో ఉన్నారు. జార్జియా, ఆరిజొనా, నెవాడలో కూడా బిడెన్ హవా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో విజేతను ప్రకటిస్తారని బిడెన్ సన్నిహితులు చెబుతున్నారు.పెన్సిల్వేనియో, జార్జియాతోపాటు ఫిలడెల్పియా, అట్లాంటాలో కూడా బిడెన్ లీడ్‌లో కొనసాగుతున్నారు. అయితే ఫిలడెల్పియాలో ట్రంప్ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం తన ఓటమిని ఏ మాత్రంజీర్ణించుకోలేకపోతున్నారు. రెచ్చగొట్టేలా ట్వీట్లు పెడుతున్నారు.

 అయితే ఇప్పటికే ట్రంప్  పెట్టిన పలు ట్వీట్లను ట్విట్టర్​ తొలగించింది. మరోవైపు ఆయన  ప్రెస్​మీట్​ను కూడా కొన్ని చానళ్లు అర్ధాంతరంగా నిలిపివేశాయి. రిపబ్లికన్లు ఓడిపోతే అమెరికాలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ట్రంప్​ హుందాగా తన ఓటమిని అంగీకరిస్తే బాగుంటుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్​ మాత్రం వైట్​హౌస్​ను వదిలేలా లేరు. కోర్టుకు వెళ్లి అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలను ఆపుతానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో అమెరికాలో ఏం జరుగబోతున్నదోనని యావత్​ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
Tags:    

Similar News