దిగిపోయినా అమెరికా అధ్యక్షులు సేఫ్ సైడే

Update: 2020-11-08 12:10 GMT
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడైనా దిగిపోయినా సరే వారి లైఫ్ బిందాస్ గానే ఉంటుంది. అత్యంత ధనిక దేశానికి అధ్యక్షుడిగా చేసి దిగిపోయి మాజీ అయిన అధ్యక్షులకు పింఛన్ భారీగా అందుతుంది.

అమెరికా దేశ అధ్యక్షుల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం వారికి ఏడాదికి రూ.1.6 కోట్లు చొప్పున పింఛను మంజూరు చేస్తుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా  ఏడాదికి రూ.20వేల డాలర్లు చెల్లిస్తారు.

దీనికి తోడు శ్వేతసౌధం వదిలిన తర్వాత మరో నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం  అయ్యే ఖర్చును కూడా అమెరికా ప్రభుత్వమే భరిస్తోంది.  అంతేకాక.. సంపూర్ణ ఆరోగ్య బీమాతోపాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు.

1912లో అండ్రూ కార్నెగీ అనే పారిశ్రామికవేత్త మాజీ అధ్యక్షులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ కాలంలోనే ఏటా 25వేల డాలర్లు పింఛను ఇస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సిస్టం మొదలైంది. మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ పింఛన్ మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి  2.19, 200  డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1.6 కోట్లు పింఛనుగా ఇస్తున్నారు.
Tags:    

Similar News