కరోనాని నిలయంగా వైట్ హౌస్ .. ఎంతపని చేశావయ్యా ట్రంప్ !

Update: 2020-10-07 07:15 GMT
అమెరికా అధినేత అధికారిక నివాసం వైట్ ‌హౌస్‌.. ప్రాణాంతక కరోనా వైరస్ కి నిలయంగా మారినట్టు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఈ వైరస్ బారిన పడిన తరువాత, వరుసగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.   ఏకంగా 10 మంది వరకు సిబ్బందికి ఈ కరోనా మహమ్మారి సోకింది. వారికి నిర్వహించిన పరీక్షలు పాజటివ్‌గా తేలాయి. దీనితో వారందరూ కూడా క్వారంటైన్‌ లోకి వెళ్లిపోయారు.అతి త్వరలో ఎన్నికలు ఉన్నాయి , దీనితో ప్రచారం జోరుగా  చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కరోనా బారిన పడ్డారు.

ట్రంప్‌ కు కరోనా సోకిన తరువాత ఆయన ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ఐసొలేషన్‌ లో ఉంటున్నారు. అయిదు రోజులుగా తాను ఐసొలేషన్‌ లో ఉంటూ వీడియో కాన్ఫరెన్సులు, ఆన్‌లైన్ ద్వారా విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. అయిదు రోజుల్లో మూడుసార్లు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, నెగెటివ్ రిపోర్టులు వచ్చాయని , మరోసారి టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్టీఫెన్ చెప్పారు. ప్రస్తుతం తాను మరికొద్దిరోజుల పాటు క్వారంటైన్ ‌లో కొనసాగుతానని చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలోనే వైట్ ‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కేయిలె మెక్ ఏ  నానీకి కరోనా వైరస్ సోకింది.

 దీనితో ఆయన క్వారంటైన్‌ లో ఉంటున్నారు. మెక్ ఏ నానీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన పేషీలో పనిచేసే సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. . వైట్‌ హౌస్‌ లో నిర్వహించే విలేకరుల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముగ్గురు జర్నలిస్టులు కూడా దీని బారిన పడ్డారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్‌ లో ఉంటున్నారని వైట్‌ హౌస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కరోనా వైరస్ నుంచి కోలుకుని, డిశ్చార్జయిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వైట్‌ హౌస్‌ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారు. 48 గంటల పాటు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, అయినప్పటికీ..ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాల్సి ఉన్నందున ముందుజాగ్రత్త చర్య కింద డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉంటున్నారని పేర్కొంది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్లను ఆయన ధరిస్తున్నారని, మాస్కులను ధరిస్తున్నారని స్పష్టం చేసింది
Tags:    

Similar News