• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మ ఒడికి.. అలవి కాని ...

అమ్మ ఒడికి.. అలవి కాని ఆంక్షలు

By - Tupaki Desk
Update: 2022-04-15 06:53 GMT
అమ్మ ఒడి. ఇది జగన్ మానస పుత్రిక. పాదయాత్ర సమయాన ఆయన మదిలో మెదిలిన పధకం. ఏపీలో ఇకపైన ఏ పేద బిడ్డ డబ్బు లేక చదువులు మధ్యలో ఆపరాదు అని జగన్ భావించి అమ్మ ఒడిని ప్రవేశపెడతామని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ అధికారంలోకి వచ్చాక ఒక ఇంటికి ఒక బిడ్డకే అని తొలి రోజుల్లోనే మడమ తిప్పేశారు.

అదే టైమ్ లో మరో పని కూడా చేశారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాల్సిన ఈ పధకాన్ని ప్రైవేట్ స్కూళ్ళకు విస్తరించారు. ఇక రెండేళ్ల పాటు విద్యా సంవత్సరం మధ్యలో ఈ పధకం కింద తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయల నిధులు వేసేవారు. ఇక మూడవ ఏడాది రావడంతోనే దాన్ని విద్యా సంవత్సరం చివరకు అని వెనక్కు తీసుకుపోయారు.

ఇపుడు చూస్తే బోలెడు ఆంక్షలు పెడుతూ అమ్మ ఒడికి తూట్లు పొడుస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. కుటుంబం వాడే గృహ  విద్యుత్ యూనిట్లు మూడు వందలు దాటకూడదు, ఇక నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకూ చూస్తే డెబ్బై అయిదు శాతం విద్యార్ధి హాజరు ఉండాలి.

ఇక మరో కండిషన్ ఏంటి అంటే ఆధార్ కార్డులో ప్రస్తుతం పాత జిల్లా ఉంటే దాన్ని మార్చి కొత్త జిల్లాలో పేర్లు నమోదు చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ ని లింక్ చేసుకోవాలి.

అలాగే విద్యార్ధి ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవాలి. పన్నులు కట్టేవారు ఈ పధకానికి అనర్హులుగా డిసైడ్ చేశారు.  ఇవన్నీ  వినడానికి చిన్నగా కనిపించినా కష్టమైన ఆంక్షలే అంటున్నారు. లబ్దిదారుల సంఖ్యను వీలైనంతవరకూ తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా షరతులు కొత్తగా తెచ్చి పెడుతోంది అని అంటున్నారు.

వీటిని పూర్తి చేసినా ఇంకా ఏమేమి కొర్రీలు వేస్తారో అన్న డౌట్ కూడా వ్యక్తం అవుతోంది. మొత్తానికి మూడేళ్ళకే అమ్మ ఒడి భారం అయిందా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. ఇదే రకమైన కండిషన్లతో ఎన్నేళ్ళు ఈ పధకాన్ని నడపగలరు అన్న చర్చ కూడా ఉంది. అమ్మలకు మాత్రం ఇది అగ్ని పరీక్ష అని అంటున్నారు.
Tags:    
  • AmmaVodi 
  • YsJaganMohanReddy 
  • AndhraPradesh 
  • Government 
  • PrivateSchools 
  • NewDistrict 
  • AddharCard 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS