జీవిత ఖైదంటే ఇంత సుఖంగా ఉంటుందా..!!!

Update: 2015-10-07 09:20 GMT
అన్ని ప్రధాన పార్టీల్లోనూ పనిచేసిన ఆ మాజీ మంత్రికి జైలు ఇళ్లు కంటే బాగుంది... భార్యాభర్తలకు యావజ్జీవ శిక్ష పడి అది అనుభవించాల్సి ఉన్నప్పటికీ హాయిగా ఆసుపత్రిలో కొన్నాళ్లు... జైల్లోనే కొన్నాళ్లు ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారినే అటెండరుగా చేసుకుని ఈ మొగుడూ పెళ్లాలు జైలులోనూ సొంతింట్లో ఉన్నంత సుఖాలు అనుభవిస్తున్నారట.

ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి అమర్మణి త్రిపాఠీ గుర్తుండే ఉంటారు... కవయిత్రి  మధుమిత శుక్ల హత్యకేసులో ఆయన సతీసమేతంగా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.. కానీ. .పేరుకే అది అమలవుతోంది. అనారోగ్యం పేరుతో స్థానిక ఆసుపత్రిలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడాయన. అంతేకాదు ఆసుపత్రి ఆవరణలోనే దర్బారు ఏర్పాటు చేసుకుని హాయిగా సెటిల్ మెంట్లూ సాగిస్తున్నారు. ఇదంతా ఓ టీడీ ఛానల్ స్టింగు ఆపరేషన్ లో దొరికేయడంతో జైళ్ల శాఖ ఆయన్ను ఈసారి నిజంగానే లోపలేయడానికి రెడీ అవుతోంది.

మధుమిత శుక్లా హత్య కేసులో దోషులుగా తేలిన అమర్మణి, ఆయన భార్య మధుమణి గోరఖ్ పూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ వారికి సకల సౌకర్యాలు అందుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నట్లే మందీమార్బలం.. హవా కొనసాగుతోంది. జైలుగోడల మధ్య ఉండాల్సిన ఈ దంపతులు ఇద్దరూ అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరి కాలు మీద కాలేసుకుని దర్జాగా ఉన్నారు. అమర్మణి సేవలో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా తరిస్తున్నారని ఈ స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. రెండేళ్లుగా ఆయనే అమర్మణి వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఇదంతా సాగిస్తున్నారు.
Tags:    

Similar News