దేశం నిండా ‘పెళ్లికాని ప్రసాదులే’!
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. సంతాన సాగు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం ఆ మధ్య కఠిన నిర్ణయాలు పాటించింది. మనదేశంలో ''ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు'' అనే కొటేషన్లు ప్రచారం చేసినట్టుగా.. అక్కడ కూడా అమలు చేశారు. సాదాసీదాగా కాకుండా కాస్త గట్టిగానే పాటించారు. ఆ రూల్ ప్రకారం.. ఒక జంట ఒక్కరికి మాత్రమే జన్మనివ్వాల్సి వచ్చింది.
జనాభా నియంత్రణకు చేసిన ప్రయత్నం మంచిదే అయినా.. నిష్పత్తిలో తేడా గురించి పట్టించుకోలేదు. 'ఒక్కరు మాత్రమే' అని చెప్పిన ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఆ ఒక్కరిలో ఎవరు ఎక్కువగా పుడుతున్నారు..? అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా.. పురుషుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. స్త్రీల సంఖ్య తగ్గిపోయింది.
ఇటీవల జనాభా లెక్కల కార్యక్రమాన్ని కంప్లీట్ చేసిన చైనా.. మే 11న రిలీజ్ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఆ దేశంలో పెళ్లికాని ప్రసాదులు ఏకంగా 3 కోట్ల మందికిపైగా ఉన్నారట! నిష్పత్తి ప్రకారం చూస్తే.. 111.3 మంది మగాళ్లకు వంద మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారట. జిల్లాకో.. రాష్ట్రానికో ఈ తేడాలు ఉంటే.. సర్దుబాటు చేయొచ్చు. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంటే ఏం చేస్తారు? అందుకే.. ఒంటరిగా జీవితం గడిపేస్తున్నారట కోట్లాది మంది ఫాఫం!
పదేళ్ల క్రితం చూస్తే.. ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2010లో ఈ నిష్పత్తి మరీ ఎక్కువగా ఉంది. వంద మంది అమ్మాయిలకు 118.1 మంది అబ్బాయిలు ఉన్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగైనప్పటికీ.. ఇంకా తేడా చాలానే ఉంది.