ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా అధికారం !

Update: 2022-10-05 14:30 GMT
దశాబ్దాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది బీజేపీ పట్టుదల. అందుకని అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. పైగా కేంద్రంలో ఉంటు రాష్ట్రాన్ని నియంత్రిస్తోంది కాబట్టి ప్రయత్నాలు సాఫీగా సాగుతున్నాయి.

మరి జనాలు ఏమనుకుంటున్నారు ? ఇదంతా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జమ్మూలో పర్యటించిన కేంద్ర హోంశాఖ అమిత్ షా మాట్లాడుతు మూడు వర్గాలకు తొందరలోనే రిజర్వేషన్లు అమలు కాబోతున్నట్లు ప్రకటించారు.

కాశ్మీర్ పర్యటనలో రాజౌరిలో అమిత్ మాట్లాడుతు గుజ్జర్లు, బకర్వాల్లు, పహరీ సామాజికవర్గాలకు తొందరలోనే రిజర్వేషన్ల సౌకర్యాలు అందుతాయన్నారు. పై వర్గాలకు ఎస్టీ హోదాను కల్పించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించారు. 370 అధికరణాన్ని తొలగించిన కారణంగానే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం కేంద్రానికి దక్కిందని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తికాగానే పై వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ వ్యూహం. ఇందులో భాగంగానే కొత్త ఓటర్లను ప్రక్రియ మొదలైంది. అయితే దీన్ని లోకల్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధంలేని వాళ్ళందరినీ లోపలికి పిలిపించి స్ధానికులని చెప్పి ఓటర్లుగా నమోదు చేయిస్తున్నట్లు బీజేపీపై మండిపోతున్నాయి. ఇప్పటికే ఈ పద్దతిలో లక్షల్లో కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇదే కాకుండా ప్రతిపక్షాలను విడదీయటం, ప్రతిపక్షాల్లోని గట్టి నేతలను ఆకర్షించేందుకు గాలమేయటం లాంటి వ్యవహారాల్లో బీజేపీ బిజీగా ఉంది. ఇవన్నీ సరిపోవన్నట్లు మూడు సామాజికవర్గాలను ఎస్టీలో చేర్చబోతున్నట్లు తాజాగా ప్రకటించింది.

అధికారం కోసం ముందు ముందు ఇంకెన్ని చర్యలకు దిగబోతుంది ఎవరు చెప్పలేకున్నారు. మొత్తానికి ఏమిచేసైనా సరే అధికారంలోకి రావటమే టార్గెట్ గా పెట్టుకున్నది. మరి కమలంపార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయా ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News