ఉండవల్లి శ్రీదేవి వారి ఆడియో 2 విడుదలైంది!
సన్నిహిత అనుచరులుగా ఉన్న వాళ్ల దగ్గర నేతలు నాలుగు మాటలు అంటారు. అందులో అవసరమైనవి.. అనవసరమైనవి ఉంటాయి. కానీ..నమ్మకద్రోహంతో వాటిని రికార్డు చేసుకొని.. సమయానికి తగ్గట్లుగా విడుదల చేస్తే? ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఏపీ అధికారపార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది.
గతంలోఒక ఆడియో క్లిప్ బయటకు రావటం.. అందులోని అంశాలపై మొదలైన రచ్చ ఇప్పటికి ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మరో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. మొదటిదానికి.. రెండో దానికి పొంతన లేని సంభాషణలే అయినా.. రెండింటిలోనూ ఉన్న కంటెంట్ ఆమెను ఇరుకున పడేసేలా మారింది.అయితే.. ఆ ఆడియో క్లిప్పులు ఆమె మాట్లాడినవేనా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మధ్యలో కొన్ని మాటల్ని మార్చి.. ఆమెను ఇరుకున పడేలా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
గతంలో బయటకు వచ్చిన ఆడియోక్లిప్పులో ఏమున్నదంటే?
టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు.. మోదుగులు కలిసి క్లబ్బులు నడిపించేవారని.. మనం కూడా వారి మాదిరే పేకాట క్లబ్బులు నడిపిద్దామని చెప్పటం.. ఆ వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలన్న విషయాన్ని ఆమె చెప్పినట్లుగా ఉంది. ఈ వ్యవహారంలో ఆమె అనుచరులుగా చెప్పే ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తాజాగా వచ్చిన ఆడియోలో ఏముందంటే?
మొదటి ఆడియో క్లిప్పు వివాదం ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మరో ఆడియో బయటకు వచ్చింది. అందులో అగ్రకులాలకు చెందిన పార్టీ నేతలు తమ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయాలపై ఆమె మాట్లాడినట్లుగా ఉంది. అన్నింటికి మించి రెడ్ల సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆ వర్గానికి చెందిన నేతల మనసులు చివుక్కుమనేలా ఉండటం గమనార్హం.
రెడ్లు అనేవాళ్లు చాలా డేంజర్ అన్న మాట ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. పవర్ అంతా వాళ్ల చేతిలో పెట్టుకొని తమను ఎలా తొక్కాలా అని మనసులో ఉంటుందన్న ఆమె.. ఎస్సీలు.. బీసీలు ఒకటిగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్లుగా ఉంది. అయితే.. ఈ తరహా ఆడియోతో తనను రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర జరుగుతోందంటున్నారు. మరి.. తాజా వీడియోపై సీఎం ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.