• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉండ‌వ‌ల్లి...

ఉండ‌వ‌ల్లి క్లారిటీ-వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను

By - Tupaki Desk
Update: 2017-07-03 15:04 GMT
సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ సాధార‌ణంగా ఏ విష‌యంపై అయినా దారాళంగా మాట్లాడ‌గ‌ల‌రు. త‌డుముకోకుండా స‌మాచారం చెప్ప‌డంలో, ప్ర‌శ్న‌లు సంధించ‌డంలోనూ ఉండ‌వ‌ల్లిది అందెవేసిన చేయి. అలాంటి ఉండ‌వ‌ల్లిని ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం, ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీలు గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నాయ‌ట‌. ఈ మాట చెప్పింది సాక్షాత్తు ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమారే! కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుతో కలిసి కొత్త అసెంబ్లీ చూడడానికి వచ్చిన ఉండవల్లి మీడియాతో ముచ్చటిస్తూ ఈ మాట చెప్పారు.

ఏపీ నూతన సచివాలయానికి విచ్చేసిన అనంత‌రం ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ...అసెంబ్లీని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ విషయాన్ని మల్లాది విష్ణుకు చెబితే ఆయన ఈ రోజు బాగుందని చెప్పి వెళ్దామంటే వచ్చానని ఉండవల్లి చెప్పారు. ఇంత‌కీ అసెంబ్లీ ఎలా ఉంది అని విలేక‌రి ఒక‌రు ప్ర‌శ్నించ‌గా...  ‘కొత్త అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి వెళ్ల‌నున్న ఉండ‌వ‌ల్లి అంటారు. అసెంబ్లీ బాగాలేదంటే ప్ర‌తిప‌క్ష‌ వైసీపీలో చేరుతున్నట్లున్నారే అంటారు’ అని చ‌మ‌త్కారంగా స్పందించారు. అసెంబ్లీ నిర్మాణం బాగుందని, వర్షపు నీరు వచ్చినంత మాత్రాన వివాదం చెయ్యాల్సిన అవసరం లేదని అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తనకు టీడీపీలోనూ, వైసీపీలోనూ తెలిసినవాళ్లు ఎవరూ లేరని అందుకే మల్లాది విష్ణుతో కలిసి వచ్చానని ఉండవల్లి అరుణ్‌ కుమార్ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, 2019 ఎన్నికల్లో పోటీచేయనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Undavalli Arun Kumar 
  • Next Elections 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS