యోగిని కడిగేసిన ఉమాభారతి.. ఎందుకంటే?
హత్రాస్ హత్యాచార బాధితురాలు విషయంలో యూపీ సర్కార్ , పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లో దళితులపై వరుస అఘాయిత్యాలతో బీజేపీకి దేశవ్యాప్తంగా డ్యామేజీ జరుగుతోంది. ఇది యూపీ సర్కార్ కే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కార్ ను కూడా ఇబ్బందులు పెడుతోంది.
ఇటీవల హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం.. అనంతరం హత్యకు పాల్పడడం కలకలం రేపింది. నిందితులను పట్టుకోకుండా బాధిత యువతి మృతదేహాన్ని అర్ధరాత్రి దహనం చేయడం మరింత వివాదానికి దారితీసింది.
అందరూ తిట్టిపోస్తున్నారు. ఈ బ్యాచ్ లోకి సొంత పార్టీ బీజేపీ మహిళా అగ్రనేత ఉమాభారతి కూడా చేరారు. మాజీ కేంద్రమంత్రి, యూపీకే చెందిన ఉమాభారతి తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘ఉత్తరప్రదేశ్ ఘటన.. పోలీసుల తీరు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీకి మచ్చ తెచ్చిందని’ ఉమాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సర్కార్ కు ఆమె కొన్ని సలహాలు , సూచనలు చేశారు. ‘ఓ దళిత బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంతిమ సంస్కారాలను పోలీసులు హడావుడిగా ముగించారు. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని గ్రామాన్ని ఎవరితో కలవనీయకుండా ఆంక్షలు విధించారు. హత్రాస్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటారని భావించి నేను ఏమీ మాట్లాడవద్దని అనుకున్నా.. బాధితుల పట్ల పోలీసుల ప్రవర్తన అత్యంత అమానవీయంగా ఉంది’ అని ఉమా భారతి వాపోయారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. కానీ హత్రాస్ లో పోలీసుల తీరుతో బీజేపీకి మచ్చ వస్తోందని’ ఉమాభారతి ట్వీట్లలో ఆగ్రహం వ్యక్తం చేశారు.