బుర్ఖా తీసేయండి..ఆరోగ్యంగా ఉండండి!

Update: 2017-05-27 05:18 GMT
బ్రిటన్‌ లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు బరిలోకి దిగిన యూకే ఇండిపెండెన్స్‌ పార్టీ (యూకేఐపీ) ఒక కొత్త హామీని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలకు మరింత స్వేచ్ఛను ఇస్తామని, వారు బురఖా ధరించడాన్ని రద్దు చేస్తామని తెలిపింది. అయితే ఇందుకు ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం తెలిపింది. అదే ముసుగు (బురఖా) వల్ల ముస్లిం మహిళలకు డీ విటమిన్‌ అందడం లేదని అందుకే దానిని రద్దు చేస్తామని తెలిపింది.

యూకే ఇండిపెండెన్స్‌ పార్టీ వాద‌న ప్ర‌కారం...``ముఖాన్ని సైతం కప్పేసే బుర్ఖాను ధరించడం వల్ల సూర్యరశ్మి నుంచి వ‌చ్చే విటమిన్-డీ శరీరానికి అందకుండా పోతుంది.  తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సదరు వ్యక్తిని ఇతరులు గుర్తించలేకపోవడం వల్ల వారితో మాట్లాడడమూ కష్టమే. ఫలితంగా వారు తమ ఉద్యోగావకాశాలనూ కోల్పోతారు``అని తన మేనిఫెస్టోలో వివరించింది. బుర్ఖా ధారణ అమానవీయమని, అది సంఘం నుంచి మహిళలను వెలివేయడం లాంటిదని, ఒకరకంగా అణచివేతకూ నిదర్శనమని పార్టీ వ్యాఖ్యానించింది. మరోవైపు మహిళలను, స్వలింగసంపర్కులను ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించే వ్యక్తులకు తమ దేశంలో ప్రవేశం లేకుండా చేసేందుకు వలస విధానంలో సాంఘిక వైఖరులు అనే పరీక్షను తప్పనిసరి చేస్తామని పార్టీ ప్రకటించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News