ఆ ఎయిర్ పోర్టులో కుక్కులు చేసే పని ఏమిటో తెలుసా?

Update: 2020-08-04 03:30 GMT
అవసరాలకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవటంలో మనిషికి మించినోడు మరొకడు ఉండదు. ఈ ఏడాది ఆరంభం నుంచి వణికిస్తున్న కరోనా.. ఇప్పట్లో తగ్గే సూచనలుకనిపించట్లేదు. కరోనాతో సహజీవనం తప్పించి మరో మార్గం లేదన్న విషయం రాజకీయ ప్రముఖులే కాదు.. అధికార పక్ష అధినేతలు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇక.. కరోనా కేసులు నమోదు తగ్గిపోవటానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా.. ఫలితాలు అంతంతమాత్రమే.

కరోనా వేళలో పని చేయటం.. బహిరంగ ప్రదేశాల్లో విధి నిర్వహణ ఏ మాత్రం సేఫ్ కాదు. అదే విషయాన్ని గుర్తించారు యూఏఈ పోలీసులు. కరోనా బారిన పడిన వారిని గుర్తించేందుకు వీలుగా కుక్కల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. విమాన ప్రయాణాల్ని పూర్తి చేసుకొని ఎయిర్ పోర్టులో అడుగు పెట్టి.. బయటకు వెళ్లే సమయంలో.. ప్రయాణికుల్ని వాసన ఆధారంగా వారు కరోనా బాధితుడా? లేదంటే అనుమానితుడా? అన్న విషయాన్ని గుర్తించేలా కుక్కలకు శిక్షణ ఇప్పించారు.

కుక్కలకు ఇచ్చిన శిక్షణ బాగా వర్క్ వుట్ అయినట్లుగా చెబుతున్నారు. యూఏఈ ఎయిర్ పోర్టులో కుక్కలతో కలిపి కొత్తగా కే9ఫోర్స్ అనే పేరుతో కొత్త ఫోర్సును ఏర్పాటు చేశారు. ప్రయాణికుల చెమట వాసన ఆధారంగా వారికి కరోనా ఉందో లేదో కూడా తేల్చేస్తారని చెబుతున్నారు. ఇంతకీ ఎయిర్ పోర్టులో శిక్షణ పొందిన కుక్కలు ఏం చేస్తాయి? కరోనా సోకిన వ్యక్తిని ఎలా గుర్తిస్తాయన్న విషయంలోకి వెళితే.. ఎయిర్ పోర్టులోకి ప్రయాణికులు విమానం నుంచి దిగగానే.. వారిని ఒక ఛాంబర్ లో ఉంచుతున్నారు. వారి చెమట శాంపిళ్లను సేకరిస్తున్నారు. శిక్షణ పొందిన కుక్కలకు వీటిని వాసన చూపిస్తున్నారు.

కరోనా ఉన్న శాంపిల్ ను గుర్తించిన వెంటనే.. కుక్కలు అక్కడే కూర్చునేలా శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకూ కుక్కలు పసిగట్టిన కేసుల్లో 90 శాతం వరకు సక్సెస్ రేటు ఉన్నట్లు చెబుతున్నారు. యూఏఈ గురించి తెలుసుకున్నాయో.. సొంతంగా కానీ యూరోప్ కు చెందిన పలు దేశాలు కుక్కలకు కరోనాను గుర్తించే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదకర వైరస్ తో డీల్ చేసే సమయంలో పెంపుడు జంతువులు వాసన చూసి గుర్తించే వైనం బాగుందనే చెప్పాలి.
Tags:    

Similar News