మరో రెండు ప్రభుత్వ బ్యాంకులు ప్రై‘వేటు’కు..

Update: 2021-04-15 10:30 GMT
కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక అంతా ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పప్పూ బెల్లాలు లెక్కన అమ్మేస్తోందన్న విమర్శలు తెచ్చుకుంది. ఇక రూపాయి కూడా నష్ట్రాలు భరించలేమని చేతులెత్తేసి నష్టాల్లో ఉన్న బ్యాంకులను పెద్ద ఎత్తున విలీనం చేసేసింది. 30కు పైగా బ్యాంకులున్న దేశంలో 12 బ్యాంకులకు కుదించింది. తాజాగా మరో రెండు బ్యాంకులకు కేంద్రం ఎసరు పెట్టింది.. రెండు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం బ్యాంకుల ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోంది. తాజాగా ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు , నీతి అయోగ్, ఆర్బీఐ సమావేశం నిర్వహించి ఏఏ బ్యాంకులు ప్రైవేటీకరణ చేయాలనే దానిపై షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం.

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. నాలుగు బ్యాంకుల పేర్లను నీతి అయోగ్ సూచించినట్టు తెలిసింది. ఆ నాలుగింటిలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

నీతి అయోగ్ తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు పేర్లను సూచించగా.. ఇందులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ లను ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. వీటినే ఫైనల్ చేస్తుందని సమాచారం.




Tags:    

Similar News