అమెరికాలో మళ్లీ కాల్పులు: నైట్ క్లబ్ లో ఇద్దరు మృతి
అభివృద్ధి చెందిన దేశం.. అగ్రగామిగా నిలుస్తున్న అమెరికాలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే వైరస్ తో వణికిపోతుంటే ఆ దేశానికి వర్ణ వివక్ష పోరాటం.. తలనొప్పిగా మారగా ఇప్పుడు తాజాగా తుపాకీ సంస్కృతి ఆందోళన రేపుతోంది. తరచూ ఎక్కడో ఒక చోట తుపాకీ పేల్చివేత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.
అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఒక నైట్‌క్లబ్‌లో తుపాకీ పేలుళ్లు జరిగాయి. ఒక దుండగుడు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ దుండగుడి కాల్పుల్లో మరో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటన అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది గాయపడ్డారని.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కాల్పుల్లో మకతి చెందిన వారిని లూయిస్, బోల్ట్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.