టీడీపీలో కోవర్టులున్నారా ?
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన రెండు కామెంట్లు ఆశ్చర్యంగా ఉన్నాయి. తాజాగా సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ కొందరు నేతలు పార్టీలోనే ఉంటు పార్టీకే వెన్నుపోటు పొడిచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే పార్టీలో కోవర్టులున్నారని చెప్పారు. స్వయంగా చంద్రబాబే వెన్నుపోటని, కోవర్టులని చెప్పటం విచిత్రంగా ఉంది.
వైసీపీ నేతలతో టీడీపీలోని కొందరు నేతలకు వ్యాపార సంబంధాలున్నాయని కుప్పంలోని ద్వితీయ స్థాయి నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. అయినా చంద్రబాబు దేన్నీ పట్టించుకోలేదు. 2019లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు కుప్పంలో పర్యటించినపుడే స్థానిక నేతలు కొందరు బాహాటంగానే ఐదుమంది నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నపుడు అపరిమితమైన అధికారాలను అనుభవించిన వారిపై ద్వితీయ స్థాయి నేతల్లో చాలామందికి బాగా మంటుంది.
ఈ ఐదుగురు నేతల వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతోందో వాళ్ళ మొహానే కొందరు నేతలు ఆధారాలతో సహా ఆరోపించారు. దాంతో ఆ ఐదుగురు నేతలు తమ పదవులకు సమావేశంలోనే రాజీనామాలు చేసేశారు. అయితే చంద్రబాబు కలగజేసుకుని వివాదాన్ని ముగించారు. వాళ్ళ రాజీనామాలను ఆమోదించకుండా మళ్ళీ పార్టీ పెత్తనమంతా వాళ్ళ చేతుల్లోనే పెట్టారు. దాంతో ద్వితీయ స్ధాయి నేతల కోపమంతా వీళ్ళమీద నుండి చంద్రబాబు మీదకు మళ్ళింది.
తాము అంతగా వ్యతిరేకిస్తున్న నేతలనే మళ్ళీ తమ మీద చంద్రబాబు రుద్దటం తో పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. దాని ఫలితమే స్ధానిక సంస్ధల ఎన్నికల మీద స్పష్టంగా కనబడుతుంది. వాస్తవాలను వదిలిపెట్టేసి పార్టీలో కోవర్టులున్నారని, వెన్నుపోటు నేతలున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఉపయోగం ఉండదు. టీడీపీలో కోవర్టులున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు అర్ధమేంటి ? ఉంటే అధికార పార్టీ తరపున కోవర్టులుండాలి.
వైసీపీ నేతలతో టీడీపీ నేతలకున్న వ్యాపార బంధాలను కుప్పంలో నేతలు చెప్పినా అప్పట్లోనే చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు ? ద్వితీయ నేతలు చేసిన ఆరోపణలన్నీ చంద్రబాబు సన్నిహితులను ఉద్దేశించే అని అందరికీ తెలుసు. అయినా వాళ్ళను దూరంగా పెట్టకుండా పెత్తనమంతా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఎందుకుంచారు ? తప్పులన్నీ తనలోనే పెట్టుకుని మళ్ళీ కోవర్టులున్నారు, వెన్నుపోటు నేతలున్నారని చెప్పటమంటే కేవలం ఐవాష్ అనే అనిపిస్తోంది.
పైగా కుప్పంలోనే కాకుండా ఇంకా కొన్నిచోట్ల కూడా ఇలాంటి నేతలున్నట్లు చంద్రబాబు చెప్పారు. మరలాంటి నేతలందరినీ గుర్తించేదెప్పుడు, ఏరేసేదెప్పుడు ? ఇవన్నీ చంద్రబాబు వల్ల జరిగే పని కాదని అందరికీ తెలుసు. నిజంగానే పార్టీలో కోవర్టులు, వెన్నుపోటు నేతలుంటే వాళ్ళలో చాలామంది చంద్రబాబుకు సన్నిహితులే అయ్యుంటారు. కాబట్టి ఎవరి మీదా యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. ఏదో అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటారంతే.