ట్విట్టర్ బ్యాన్ .. నైజీరియాపై ట్రంప్ ప్రశంసలు !

Update: 2021-06-09 11:31 GMT
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ ను బ్యాన్ చేసినందుకు నైజీరియాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. మరిన్ని ఇతర దేశాలు కూడా ఈ విధమైన చర్య తీసుకోవాలని ఇదే సమయంలో ఫేస్ బుక్ ని కూడా బ్యాన్ చేయాలన్నారు. నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ చేసిన ట్వీట్ తమ నిబంధనలను అతిక్రమించేదిగా ఉందని, మారణ కాండకు దారి తీసేట్టు ముప్పు కలిగించేలా ఉందంటూ ట్విటర్ దాన్ని తొలగించింది. అయితే తాను వెంటనే డెలిట్ చేసినదాన్ని ట్విటర్ పేర్కొందని నైజీరియా అధ్యక్షుడు విమర్శించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సామాజిక మాధ్యమాన్ని నైజీరియా ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీనిపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, మరిన్ని ఇతర దేశాలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని అంటూ, స్వేచ్ఛగా ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కును ట్విటర్, ఫేస్ బుక్ రెండూ అణగదొక్కుతున్నాయని ఆరోపణలు చేశారు. అన్ని గళాలను ఇవి కవర్ చేయాల్సిందే అన్నారు. జనవరి 6 న వాషింగ్టన్ లోని కేపిటల్ హిల్ లో జరిగిన దాడి అనంతరం ట్విటర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. నాడు ఆయనకు, ట్విటర్ కు మధ్య వార్ వంటిది జరిగింది. అప్పటినుంచి ట్రంప్ తన సొంత ట్విటర్ పైనే ఆధారపడుతున్నారు. ఇక ఫేస్ బుక్-రీవాల్యుయెషన్ కి ముందు మరో రెండేళ్ల పాటు తాము ఆయన అకౌంట్ ను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. దీనితో అయన మరింతగా ఫైర్ అయ్యారు.
Tags:    

Similar News