టాప్ టెన్‌ లో ట‌ర్కీ.. 9 కోట్ల జ‌నాభాలో ల‌క్ష మంది క‌రోనా బాధితులే

Update: 2020-04-25 02:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఏకంగా యాభై ల‌క్ష‌ల‌కు పైగా కేసులు పెరిగే అవ‌కాశం ఉంది. ప‌లు దేశాల్లో ఆ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎన్ని క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఆ వైర‌స్ విలయతాండవం చేస్తోంది. ఈ క్ర‌మంలో కొన్ని దేశాల్లో క‌రోనా కేసులు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉంటున్నాయి. అమెరికాలో 8 ల‌క్ష‌ల‌కు పైగా ఈ వైర‌స్ కేసులు ఉండ‌గా, స్పెయిన్ రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత ఇట‌లీ - ఫ్రాన్స్‌ - జ‌ర్మ‌నీ - యూకే (లండ‌న్‌) ఉండ‌గా ఆ త‌ర్వాత స్థానం మ‌న‌దేశంలోని ఒక రాష్ట్రం జ‌నాభా ఉన్న దేశం ఇప్పుడు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదైన జాబితా లో చేరింది. క‌రోనా పాజిటివ్ కేసులు ల‌క్ష‌కు పైగా న‌మోదైన దేశాల జాబితా లో ట‌ర్కీ దేశం కూడా చేరింది. ఆ దేశంలో శుక్ర‌వారం ఉద‌యం నాటికి 1,01,790 క‌రోనా కేసులు న‌మోదై ఉన్నాయి.

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. మందు లేక పోవ‌డ‌మే కరోనా వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతోంది.  ఈ క్ర‌మంలో చాలా దేశాల్లో ఆ వైర‌స్‌ ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం ఆ వైర‌స్ ప్ర‌పంచం లోని మొత్తం 210 దేశాలకు విస్తరించింది. ఇక ప్ర‌పంచ‌ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 27,04,676కు చేరాయి. ఈ లెక్క‌ల్లో మొత్తం 1,90,549 మంది క‌రోనా తో బాధ‌ ప‌డుతూ మృత్యువాత పడ్డారు. వీరిలో కేవ‌లం 7,38,032 మంది కోలుకున్నారు. అమెరికా లో 8,89,568 కేసులు ఉండ‌గా కోలుకున్న వారు 81,792 మంది, మృతిచెందిన వారు 50,177 మంది. అస‌లు వైర‌స్ పుట్టిన చైనా దేశంలో మాత్రం కేసులు 82,810 న‌మోదై ఉండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News