కరోనా:ట్యునీసియాలో లాక్ డౌన్..గస్తీ కాస్తున్న 'పోలీస్ రోబోలు'

Update: 2020-04-04 12:52 GMT
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి దెబ్బకి ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళింది. కరోనా కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో - కరోనాను అరికట్టాలంటే ..సామజిక దూరం పాటించడం ఒక్కటే మార్గం కావడంతో ప్రపంచంలోని మెజారిటీ దేశాలు  లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారికి గురైన దేశాల్లో ట్యునీసియా కూడా ఒకటి.. ఫలితంగా అక్కడ కూడా లాక్ డౌన్ అమలవుతోంది.

ప్రజలు ఇళ్లలో ఉండకుండా రోడ్ల మీదికి వస్తే పోలీసులతో బాటు ఓ రోబో కూడా వారిని ఆపేస్తూ.. పెట్రోలింగ్ డ్యూటీ చేస్తోంది. ఎవరైనా వీధుల్లో కనబడితే చాలు, అక్కడే వారిని ఆపేస్తోంది. వాళ్ళు తమ ఐడీ కార్డును - ఇతర పత్రాలను చూపిన తరువాతే అది రూటు మార్చుకుంటోంది. ఈ నాలుగు చక్రాలు గల ఈ పోలీస్ రోబోలను పీగార్డ్స్ అని వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఈ పోలీస్ రోబోలలో థర్మల్ ఇమేజింగ్ కెమెరా - లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సాధనాలు ఉంటాయి. ఇది రాడార్ లా పని చేసినప్పటికీ - రేడియో తరంగాల బదులు లైట్ ను వినియోగించుకుంటుంది. ఇకపోతే , ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా  ట్యునీసియాలో 14 మంది కరోనా బాధితులు మరణించారు. మాస్కులు తయారు చేసేందుకు సుమారు 150 మంది సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ దేశంలో 436 మంది కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కేవలం అత్యవసరం ఉన్నా వారినే రోడ్డుమీదకు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు.  ట్యునీసియా వాసుల్లో కొందరు ఈ పోలీస్ రోబోలను సాగతీస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం ఇది మరీ స్లోగా నడుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News