టీటీడీ ఈవో సింఘాల్ పదవీ సమయం మరోసారి పొడగింపు!
తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఈవోగా పని చేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ కొనసాగాలని ఆ ఉత్తర్వులో తెలిపింది.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ను 2017 మేలో టీటీడీ 25వ ఈవోగా డిప్యూటేషన్ పై తీసుకువచ్చారు. టీటీడీ ఈవోగా రెండేళ్ల పాటు ఉండే ఈ పదవిలో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్ ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి డిప్యూటేషన్ ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ టీటీడీ ఈవో కొనసాగాలని స్పష్టం చేసింది.
అయితే , తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా టీటీడీ ఈవో సింఘాల్ టార్గెట్ గా కీలక చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ చంద్రబాబు ఆజ్ఞలను పాటిస్తూ.. కోర్టు ఆదేశాలను, జగన్ సూచనలను పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఈవో గా మరోసారి సింఘాల్ కొనసాగాలని ఆ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. సింఘాల్ గత టీడీపీ హయాంలో ఈవోగా నియమితులైనా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయనే కొనసాగుతుండటం గమనార్హం.