కాంగ్రెస్ కాలం చెల్లిందా కేటీఆర్ ? ఏం సెప్తిరి !

Update: 2022-06-19 15:30 GMT
ఏ పార్టీ అయినా కొంత  కాలం రాజ‌కీయ హ‌వాను కొనసాగించ‌డం ఖాయం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అతీతంగా లేదు. మినహాయింపు కాదు. తాజాగా మారుతున్న ప‌రిణామాల్లో భాగంగా కాస్త కేసీఆర్-కు  కౌంట‌ర్లు ఇవ్వ‌డంతో కాంగ్రెస్ పార్టీ ముందుంది. బీజేపీ కన్నా రేవంత్ రెడ్డి కాస్త ఘాటు వ్యాఖ్య‌లే చేస్తారు. ఓ విధంగా బండి సంజ‌య్ కౌంట‌ర్ల క‌న్నా రేవంత్ బాగానే మాట్లాడి నెగ్గుకు రాగ‌లరు అన్న విశ్వాసం కూడా చాలా మందిలో ఉంది.

అందుకే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట‌లు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. అవుతుంటాయి కూడా !  బీజేపీ క‌న్నా స్ట్రాంగెస్ట్ ప‌వ‌ర్ గా రేవంత్ అయితే ఉన్నారు. బండి సంజ‌య్ భాష కన్నా రేవంత్ రెడ్డి లాజిక్కులే బాగుంటాయి కూడా ! ఇప్పుడు కేటీఆర్ అన్న విధంగా లేదా నిన్న‌టి వేళ ఆయ‌న చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీకి  రోజుల్లేవు అని చెప్ప‌డం త‌గ‌దు. . 'కాంగ్రెస్‌ ఎన్ని డైలాగులు కొట్టినా ఒక్కటి మాత్రం పక్కా.. అది కాలం చెల్లిన మందులాంటిది. భూమి పుట్టినప్పుడు పుట్టింది. కాంగ్రెస్‌కు చరిత్ర తప్ప భవిష్యత్తు సున్నా' అని చెప్ప‌డం అస్స‌లు భావ్యం కాని ప‌ని అని తేలిపోయింది అని అంటున్నారు రాజకీయ ప‌రిశీల‌కులు.

అసలు ఈ మాట ఆయ‌న ఎలా అన‌గ‌లుగుతున్నార‌ని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా ఎప్ప‌టి నుంచో  రాజ‌కీయ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ కు భ‌విష్య‌త్ లేద‌ని చెప్ప‌డం ఏం బాలేద‌ని, ఇవ‌న్నీ రాజ‌కీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఆరోప‌ణ‌లు అని కూడా అంటున్నారు. సుదీర్ఘ కాలంగా టీఆర్ఎస్ పార్టీ త‌న‌దైన రాజ‌కీయం చేయ‌డం బాగానే ఉన్నా, తెలంగాణ ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ ను మ‌రిచిపోకూడ‌ద‌ని వారంతా అంటున్నారు.  గెలుపు, ఓట‌ములే ప్రామాణికంగా తీసుకుని రాజ‌కీయం చేయాల‌నుకుంటే టీఆర్ఎస్ తొలి రోజుల‌ను త‌లుచుకోవాల‌ని కూడా వారు హిత‌వు చెబుతున్నారు.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ  కేటీఆర్ వ్యాఖ్య‌ల కార‌ణంగా కాంగ్రెస్ కాస్తో కూస్తో మైలేజీ పెంచుకోవ‌డం త‌థ్యం అని అధికారం ఉన్న వారు చేస్తున్న నెగెటివ్ కామెంట్స్ అన్న‌వి  ఓవిధంగా ఇవాళ విప‌క్ష పార్టీల‌కు ఓ ఎన‌ర్జీ బూస్టర్లుగా ఉన్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News