ఇంటి పార్టీలోనే పొలిటికల్ టూరిస్టులు ! వామ్మో !
ఆ ఇద్దరు జాతీయ స్థాయి అగ్ర నేతలను ఉద్దేశించి పొలిటికల్ టూరిస్టులు అంటూ కొన్ని వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. అవే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేటీఆర్ డైలాగులన్నీ మామూలుగా లేవు. ప్రత్యేకం అయిన శైలిలోనే వ్యంగ్య ధోరణికి అద్దం పట్టేవిధంగానే ఉన్నాయి. అర్థం చెప్పే విధంగానే ఉన్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కన్నా కేటీఆర్ వేగంగా స్పందించారు. అదే ఆశ్చర్యకరం. అంటే పార్టీలో కేటీఆర్ ఇంకాస్త యాక్టివ్ కానున్నారా ? కవిత కూడా ఇంత వేగంగా రియాక్ట్ కాలేదు. మరి ! ఆమె అయితే జాతీయ వ్యవహారాల ఇంఛార్జ్ కదా ! ఎందుకనో ఆమె సైలెంట్ అయిపోయారు. కేటీఆర్ మాత్రం మమ్మీ, డమ్మీ అన్న పదాలు తీసుకువచ్చి చాలా సేపు ఆ రెండు పదాలతోనే అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడారు. ఆల్ ఇండియా క్రైసెస్ కమిటీ అని ఏఐసీసీకి నిర్వచనం కూడా ఇచ్చారు. ఇదంతా బాగుంది. మరి ఇదే స్థాయిలో జేపీ నడ్డాను ఎందుకు అనలేదు.
జేపీ నడ్డా అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి కాదది తెలంగాణ రజకార్ల సమితి అని అన్నారు. వాటిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడాలి కానీ కేసీఆర్ ఉద్దేశం ఇప్పుడు రాహుల్ ను నిలువరించడం.అయినా మొదట్నుంచి నిజాం నవాబులను కీర్తిస్తూ ఉన్న కేసీఆర్ కు ఆ పాటి పదాలేవీ పట్టవులే ! అది వేరే సంగతి! అందుకే కేటీఆర్ రాసుకున్న లేదా రాయించుకున్న స్క్రిప్ట్ వెర్షన్ మొత్తం కాంగ్రెస్ ను తిట్టుడుతోనే అయిపోయింది అని కొందరు పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పార్టీలో పొలిటికల్ టూరిస్టులు ఎవరు ? అన్నది చూద్దాం.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరయినా కొంత కాలమే హవాను నడుపుతారు. కొంత కాలం తమ సొంత పనులు, సొంత వ్యాపారాలు చక్కదిద్దుకుంటుంటారు. అందుకు టీఆర్ఎస్ ఏమీ అతీతం కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు జనాలకు చేరువ కావడం లేదు అన్న విమర్శలూ వస్తున్నాయి.
కనుక వీళ్లంతా ముఖ్యంగా సమస్యలొస్తే ముఖం చాటేసి ఇళ్లకే పరిమితం అయి, తరువాత ఎన్నికల వేళ హడావుడి చేసిన నేతలంతా పొలిటికల్ టూరిస్టులే ! అన్నది కాదనలేని నిజం. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి అరవైకి పైగా సీట్లొస్తాయని అంటున్నారు. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్-కు ఇప్పుడు గండాలు ఎదురవుతున్నాయి. వీటిని దాటేందుకు కేటీఆర్-కు ఉన్న శక్తి సరిపోతుందో లేదో చూడాలిక.