ప్రతి ఇష్యూను ఏదోలా రచ్చ చేయకుంటే ‘తృప్తి’ ఉండదా మేడమ్?
తరచూ ఏదో ఒక ఇష్యూను పట్టుకొని దానితో కావాల్సిన దాని కంటే ఎక్కువ పాపులార్టీని తెచ్చుకునే తీరు కొందరిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తమకు ఎలాంటి మనోభావాలు ఉంటాయో.. అందరిలోనూ అలా ఉండాలని కోరుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. వామపక్ష వాదులు.. లౌకిక వాదుల పేరుతో కొందరు చేసే వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు ఒళ్లు మండిపోయేలా చేస్తాయి. నాస్తికులు అయితే మాత్రం.. తాము నమ్మిన ధర్మాన్ని ఎంతలా పాటిస్తారో.. మిగిలిన వారు సైతం అంతేలా పాటిస్తారన్నది వదిలేని తరచూ ఏదో ఒక వివాదాన్ని తెర మీదకు తేవటంలో ఉండే కొందరికి ఉండే టాలెంట్ మామూలుగా ఉండదు.
అలాంటి నైపుణ్యం సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ సొంతం. హిందూ మహిళల మనోభావాల గురించి పట్టించుకోని ఆమె.. తాను.. తన మాదిరి ఆలోచించే వారి గురించి మాట్లాడుతూ హడావుడి చేస్తుంటారు. తాజాగా ప్రఖ్యాత షిర్డీ ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన నోటీస్ ను ఆమె తప్పు పడుతున్నారు. ఇంతకూ ఆమె అంత దారుణమైన విషయంగా భావిస్తున్న అంశం ఏమిటంటే.. షిర్డీ ఆలయాన్ని దర్శించుకునే మహిళా భక్తులు.. భారతీయతను అద్దం పట్టే సంప్రదాయ వస్త్రాల్ని మాత్రమే ధరించాలని.. నాగరిక వేషధారణలో వస్తే అనుమతించమని పేర్కొంటూ నోటీస్ జారీ చేశారు.
దీనిపై తృప్తి దేశాయ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటమే కాదు.. గుడి ముందు ఏర్పాటు చేసిన పోస్టర్లను ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని.. లేనిపక్షంలో తాను.. తన స్నేహితులు వచ్చి డిసెంబరు 10న తాను.. తనతో పాటు మరికొందరు సామాజిక కార్యకర్తలు వచ్చి ఆలయం వద్ద ఏర్పాటుర చేసిన పోస్టర్ ను తొలగిస్తామని పేర్కొన్నారు.
దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆలయ అధికారులు తాజాగా ఒక నోటీసు జారీ చేశారు. దీని ప్రకారం డిసెంబరు 8 నుంచి 11 మధ్య సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ కు షిర్డీ ఆలయన ప్రవేశాన్నినిషేధిస్తూ షిర్డీ సబ్ డివిజన్ ఆఫీసు నోటీసులు జారీ చేసింది. ఆమె ఆలయంలోని ప్రవేశిస్తే.. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న మాట పోలీసుల చెబుతున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి ప్రవేశిస్తే మాత్రం అదో రచ్చగా మారటం ఖాయమని చెప్పక తప్పదు.