మెలానియాకి ట్రంప్ విడాకులు ... భరణంగా 68 మిలియన్‌ డాలర్లు !

Update: 2020-11-12 10:30 GMT
అగ్రరాజ్యం అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ .. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. జో  బైడెన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. దీనితో వచ్చే ఏడాది 20 వరకే ట్రంప్ అమెరికా అధినేతగా ఉండబోతున్నారు. ఆ తరువాత అధికారం బైడెన్ చేతుల్లోకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ... ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయాడు అని తెలిసినప్పటి నుండి భార్య మెలానియా విడాకులు ఇవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.   ఈ నేపథ్యంలో  ట్రంప్‌ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు భారీగానే భరణం అందనుంది. కాగా 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ చెప్పినట్టుగా డెయిలీ మెయిల్‌ వెల్లడించింది.

ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి ఆమె  ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు అని ఒమరోసా తెలిపారు. ఈ విలువ దాదాపు 500కోట్లకు పైగానే ఉంటుందని న్యాయనిపుణులు, న్యూమాన్   రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇకపోతే ఈ జంటకి 14 ఏళ్ల బారన్ ట్రంప్ సంతాపం. కాబట్టి ఆమెకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యూమాన్ తెలిపారు. డొనాల్డ్‌ ట్రంప్‌ కు మెలానియా మూడవ భార్య. అయితే ట్రంప్‌ మాజీ భార్యాల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందబోతుంది అని తెలుస్తుంది. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లు, రెండవ భార్యకు 2 మిలియన్‌ డాలర్లను అప్పజెప్పగా తాజాగా మెలానియాకు మాత్రం 68 మిలియన్‌ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News