డిసెంబరు 31న పార్టీకి వెళుతున్నారా? టీఆర్టీసీ ఆఫర్లు విన్నారా?
పని చేసే వాడిని ఎక్కడ పడేసినా.. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడే తప్పించి.. పని చేయటం మాత్రం ఆగదు. సైబరాబాద్ కమిషనరేట్ సీపీగా కీలక బాధ్యతలు చేపట్టి.. మూడేళ్ల వ్యవధిలో తన మార్కును వేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జన్నార్ ను కొద్ది నెలల క్రితం టీఎస్ ఆర్టీసీకి ఎండీగా చేయటం తెలిసిందే. ఐపీఎస్ అధికారి అయినప్పటికీ.. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఆర్టీసీకి ఎండీని చేసిన తర్వాత నుంచి.. ఆయన తన ముద్రను వేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా టీఎస్ ఆర్టీసీ ఉంటోంది.
ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేలా చర్యల్ని చేపడుతోంది. కొత్త సంవత్సరానికి ముందు రోజు (డిసెంబరు 31) పెద్ద ఎత్తున పార్టీలు జరగటం తెలిసిందే. ఈ పార్టీలకు హాజరయ్యే వారు తమ సొంత వాహనాల్లో వెళ్లి.. తిరిగి వచ్చే వేళ.. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుపడే అవకాశం ఉంది. అంతేకాదు.. పార్టీ జోష్ లో ప్రమాదాల్ని కొని తెచ్చుకునే కన్నా.. ప్రశాతంగా వెళ్లి.. అంతే రిలాక్స్ గా ఇంటికి వచ్చేందుకు వీలుగా తాజాగా ఒక ఆఫర్ ను ప్రకటించారు సజ్జన్నార్.
హైదరాబాద్ మహానగరానికి చెందిన 15 రూట్లలో డిసెంబరు 31 సాయంత్రం ఇంటి నుంచి పికప్ చేసుకొని.. మళ్లీ అర్థరాత్రి దాటిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేలా ప్యాకేజీని సిద్ధం చేసింది. ఉదాహరణకు కోఠి నుంచి ఓషన్ పార్కుకు.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు.. ఉప్పల్ నుంచి కొండాపూర్ కు.. మెహిదీపట్నం నుంచి శిల్పారామంకు.. దిల్ సుఖ్ నగర్ నుంచి ట్యాంక్ బండ్ కు.. విప్రో సర్కిల్ నుంచి మైత్రివనం వరకు.. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్.. ఇలా పలు రూట్లను సిద్ధం చేశారు. దీని కోసం రూ.200 చెల్లిస్తే.. రానుపోను ఛార్జీల కింద తీసుకొని.. ఇంటికి సురక్షితంగా చేరుస్తారు.
ఈ ప్రత్యేక బస్సులు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు 8.30 గంటల మధ్య నడుస్తాయి. వేడుకలు జరిగే ప్రాంతాలకు తీసుకెళతాయి. అనంతరం వేడుక ముగిసిన తర్వాత అర్థరాత్రి 12. 30 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లే వీలుంటుంది. ఇది కాకుండా 18 సీట్ల సామర్థ్యం ఉన్న ఏసీ వజ్ర బస్సుల కోసం రూ.4వేలు చెల్లిస్తే.. వారు కోరుకున్న గమ్యస్థానానికి తీసుకెళ్లి ఇంటికి తీసుకొస్తారు. ఇలాంటి సర్వీసుల కోసం 99592 26117, 99592 86129, 99592 26148 నంబర్లను సంప్రదిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
ఈ రెండు ఆఫర్లతో పాటు.. కొత్త సంవత్సర కానుకగా మరో ఆఫర్ ను ప్రకటించింది టీఎస్ ఆర్టీసీ. తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు జనవరి 1 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా సజ్జనార్ వెల్లడించారు. ఈ ఆఫర్.. అర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లోనూ ఉంటుందని పేర్కొన్నారు. కొత్త తరహాలో ఆర్టీసీని నడిపిస్తున్న సజ్జన్నార్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి.