కేసీఆర్ సభలో కనిపించని గులాబీ ట్రబుల్ షూటర్

Update: 2020-11-29 07:30 GMT
అత్యంత భారీగా ఏర్పాటు చేసిన సభ టీఆర్ఎస్ వర్గాలు అనుకున్నట్లే సక్సెస్ అయ్యింది. ముందుగా వేసుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో పెద్ద ఎత్తున భారీగా జనాల్ని స్టేడియంలోకి తరలించే విషయంలో గులాబీ నేతలు బాగానే శ్రమించారు. ఈ భారీ సభకు.. రెండు వేదికల్ని ఏర్పాటు చేశారు. ఒక వేదిక మీద ఎన్నికల బరిలో ఉన్న 150 మంది అభ్యర్థులు అయితే.. మరో వేదిక మీద టీఆర్ఎస్ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మంత్రివర్గానికి చెందిన వారంతా కూర్చునేలా వేదికను సెటప్ చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా.. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్.. కేసీఆర్ మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు సభలో ఎక్కడా కనిపించకపోవటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తనకు అప్పజెప్పిన డివిజన్ లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అలాంటి ఆయన బిజీగా ఉన్నది లేదు. అయినప్పటికీ సభకు హాజరుకాకపోవటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మంత్రి హరీశ్ తో పాటు.. మంత్రులు ప్రశాంత్ రెడ్డి.. జగదీష్ రెడ్డిలు కూడా సభకు హాజరు కాలేదు. ఇంత భారీ సభకు కీలకమైన హరీశ్ ఎక్కడా కనిపించకపోవటం ఏమిటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ట్రబుల్ షూటర్ ముఖ్యమైన మీటింగ్ వేళలో ఎందుకు హాజరుకానట్లు? ఆన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. టీఆర్ఎస్ వర్గాల్లోనూ ఈ అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Tags:    

Similar News