గాలిపటం ఎగురవేస్తూ ప్రాణం పోగొట్టుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేత

Update: 2021-01-15 04:31 GMT
సంక్రాంతి పండుగ వేళ.. సంతోషంతో పతంగులు ఎగురవేస్తున్న టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పండుగపూట పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. ఉత్సాహంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోవటమే ఈ దారుణానికి కారణంగా చెప్పాలి.

కాసింత అప్రమత్తతతో ఉంటే ఈ ప్రమాదం జరిగే అవకాశమే లేదు. ముషీరాబాద్ పరిధిలోని టీఆర్ఎస్ సీనియర్ నేత బంగారు క్రిష్ణ స్థానికంగా సుపరిచితుడు. సంక్రాంతి పండుగ సందర్భంగా బిల్డింగ్ మీదకు ఎక్కిన ఆయన.. గాలిపటం ఎగురవేయసాగారు.

అనూహ్యంగా ప్రమాదాన్ని గుర్తించలేక.. పతంగుల హడావుడిలో ఉన్న ఆయన.. భవనం పై నుంచి కిందకుజారి పడ్డారు. దీంతో.. ఆయన ఘటనాస్థలంలోనే మరణించారు. ఈ పరిణామానికి ఆయన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. అనుకోని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర విషాదంలోకి ముంచెత్తేలా చేసింది.
Tags:    

Similar News