టీఆర్ఎస్ ఎమ్మెల్యే డ్రైవర్, గన్ మెన్ కు పాజిటివ్

Update: 2020-06-20 05:00 GMT
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనతోపాటు కుటుంబ సభ్యులను చివరకు తనతోపాటు ఉండే వారికి కూడా కరోనా అంటించేశారు. తాజాగా ఎమ్మెల్యే కారు డ్రైవర్ తోపాటు ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

జూన్ 14న బాజిరెడ్డికి కరోనా సోకగా.. గురువారం ఆయన భార్యకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈయనతో కాంటాక్ట్ అయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఫొటో జర్నలిస్టుతోపాటు హైదరాబాద్ లో ఉంటున్న ఆయన సతీమణి, కుమార్తెకు కూడా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం తాజాగా ఆయన గన్ మెన్ కు, డ్రైవర్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం బాజిరెడ్డి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణలో మొదట జనగాం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పాజిటివ్ వచ్చింది.

ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డిలు గతంలో కలవడంతో వీరిద్దరికీ వైరస్ వ్యాపించింది. వీరిని కలిసిన గణేష్ గుప్తాకు అంటింది. గణేష్ గుప్తా హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలోనే చికిత్స పొందుతున్నాడు.
Tags:    

Similar News