కేటీఆర్ డౌన్ డౌన్ అనేసిన గులాబీ కార్యకర్తలు
విన్నంతనే నమ్మబుద్ధి కాదు.. ఏమైనా మార్ఫింగ్ చేశారా? అన్న సందేహం రాకమానదు. కానీ.. నిజంగా నిజం. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. గులాబీ రాజ్యానికి కాబోయే యువరాజు.. అన్ని బాగుంటే.. తండ్రి కేసీఆర్ చేతుల మీదుగా పట్టాభిషేకాన్ని చేయించుకునే కేటీఆర్ ను పట్టుకొని ఎవరైనా ఏమైనా అనొచ్చు కానీ.. గులాబీ సైన్యం నోటి నుంచి ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అనే మాట వచ్చే అవకాశమే లేదనుకోవటం ఖాయం.
కానీ.. ఈ సిత్రం తాజాగా జరిగిన భారత్ బంద్ సందర్భంగా చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో సంచలనంగా మారటమే కాదు.. విపరీతంగా వైరల్ మారుతున్న ఈ చిట్టి వీడియోను చూసిన గులాబీ సైన్యం సిగ్గుతో చితికిపోతుందట. ఎక్కడ జరిగిందన్న వివరాలు సరిగా రావటం లేదు కానీ.. ఏడు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను తరచి చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
భారత్ బంద్ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రాస్తారోకో ను పురస్కరించుకొని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారీగా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఉత్సాహంగా నినాదాలు చేయటం మామూలే. తమ నాయకుడు ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిందాబాద్ అన్న కార్యకర్తలు.. ఆ వెంటనే కేటీఆర్ అన్నంతనే.. డౌన్ డౌన్ అనటం.. ఆ వెంటనే నాలుక్కర్చుకొని.. ఓరేయ్ అన్న హెచ్చరికతో మిగిలిన వారు మాటను నోట్లోనే మింగేసిన పరిస్థితి.
అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ నిరసనను రికార్డు చేస్తున్న వారికి ఊహించని రీతిలో దొరికిన క్లిప్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఎంత పొరపాటుగా అయితే మాత్రం కాబోయే యువరాజును పట్టుకొని అంతలా డౌన్ డౌన్ అనటమా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు పొద్దున్నే మందేసి దర్నాలో కూర్చున్నారా? అంటూ నోరు జారి ఒక మాట అనేస్తున్న వైనం సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఏమైనా.. కొబోయే అధినాయకుడ్ని పట్టుకొని అంత పెద్ద మాట అనేసిన తీరు మాత్రం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.

Listen to this video till the end..