డిసెంబరు 1 నుంచి రైళ్ల రాకపోకలు బంద్.. నిజమెంత?
సోషల్ మీడియా పుణ్యమా అని ఏ నిమిషంలో.. ఏ పోస్టు బయటకు వస్తుందో.. వైరల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా.. లాజిక్కుకు సరిపోయేలా ఉండే ఈ పోస్టుల దెబ్బకు జనం తీవ్రమైన ఆందోళనకు గురయ్యే దుస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ గా మారుతోంది. ఇంతకూ సదరు పోస్టు సారాంశం ఏమంటే.. డిసెంబరు 1 నుంచి దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లుగా పేర్కొన్నారు.
ఈ వైరల్ పోస్టు విపరీతంగా షేర్ అవుతోంది. దీనికి కారణం ఏమై ఉంటుందబ్బా అన్న సందేహం వచ్చినంతనే నమ్మేసేలా.. కరోనా సెకండ్ వేవ్ ను ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. ఈ పోస్టులో వాస్తవం ఎంత? అన్న విషయాన్ని పరిశీలించేందుకు రైల్వే శాఖ అధికారుల్ని కోరితే.. వారికి అలాంటి సమాచారం ఇప్పటివరకు లేదని చెప్పారు.
ఇక.. ఈ వైరల్ పోస్టు ఫ్యాక్ట్ చెక్ చేస్తే.. అలాంటిదేమీ లేదన్న విషయం బయటకు వచ్చింది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ తరహా పోస్టులతో ప్రజల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంది. అందుకే.. ఈ పోస్టును తప్పు బడుతూ.. వివరణ ఇవ్వటం ద్వారా ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించిచ్చన్న మాట వినిపిస్తోంది. రైల్వే శాఖ మరేం చేస్తారో చూడాలి.