బీరు బాటిల్స్ తో దాడి.. ఆపై నిప్పు పెట్టారు.. ఎందుకో తెలిస్తే షాకే
ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మీడియాలో వస్తున్న కథనాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు కూడానా? అని విస్మయానికి గురయ్యేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మొన్నటికి మొన్న వైసీపీకి చెందిన నేత సుబ్బారావు మీద మంత్రి బాలినేని అనుచరులు సుభాని అండ్ కో దాడి చేయటం.. దారుణంగా తిట్టిపోయటం తెలిసిందే.
ఎందుకు ఇదంతా అంటే.. కేవలం మంత్రి బాలినేని చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించినందుకే. అంటే.. చిన్నపాటి విమర్శ సొంతోళ్లు చేసినా కూడా ఓర్చుకోలేని పరిస్థితులకు వెళ్లిపోయారా? అన్న భావన కలిగేలా చేస్తున్నాయి.
నేతలు మాత్రమే కాదు.. ఏపీలోని రాజకీయం ఎంతటి దారుణ పరిస్థితులకు వెళ్లిందంటే.. ఎవరైనా సరే.. తమ భావాల్ని వ్యక్తపరిస్తే వెనుకా ముందు చూసుకోకుండా దాడి చేసే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనకు బలం చేకూరేలా తాజా ఘటన ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పలు మీడియా సంస్థలు రిపోర్టు చేసిన వివరాల ప్రకారం చూస్తే.. పెదనందిపాటు మండలం కొప్పర్రుకు చెందిన టీడీపీ కార్యకర్త వెంకట నారాయణ వంట మాష్టర్ గా పని చేస్తుంటాడు. అత్తగారి ఊరైన పెదకూరపాడులో ఉంటున్నాడు. కొప్పర్రులో ఉన్న తల్లిని చూసేందుకు సోమవారం రాత్రి బయలుదేరాడు.
దారి మధ్యలో ఉన్నవ రోడ్డులో ఉన్న మద్యం షాపుకు వెళ్లి మద్యం తాగుతున్నాడు. అప్పటికే అక్కడ మరికొందరు మద్యం సేవిస్తున్నారు. గతంలో మద్యం ధరలు తక్కువగా ఉండేవని.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పటం.. వారి మధ్య మొదలైన చర్చ.. వాదనగా మారింది.
చివరకు గుర్తు తెలియని దుండగులు వెంకట నారాయణ మీద దాడి చేసి.. తల మీద బీరు సీసాలతో పగలకొట్టారు. నిప్పు అంటించి వెళ్లిపోయారు. 40 శాతానికి పైగా కాలిన గాయాలతో సోమవారం రాత్రి నుంచి పత్తి పొలాల్లోనే పడి ఉన్నాడు. ఉదయం వేళలో అక్కడి స్థానికులు గుర్తించి అతడ్ని.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదే ఉదంతానికి సంబంధించి సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్ని చూస్తే.. బాధితుడు తెలుగుదేశం పార్టీ కార్యాకర్త కాగా.. అతడి మీద దాడి చేసిన వారు వైసీపీ కార్యకర్తలుగా చెబుతున్నారు. ఎందుకంటే.. వీరి మధ్య మద్యం ధరల విషయం మీద వచ్చిన చర్చ అంతకంతకూ ముదరటం.. రాజకీయాల గురించి మాట్లాడుకోవటం.. ఆ సందర్భంగా వాదన పెరిగి పెద్దదై.. తమను విమర్శిస్తున్న నారాయణ మీద దాడి చేసి పరారైనట్లుగా చెబుతున్నారు.
అతడి మీద దాడి చేసిన వారు ఐదారుగురు వరకు ఉంటారని చెబుతున్నారు. అయితే.. బాధితుడి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తాను ఉన్నవ రోడ్డులోని మద్యం షాపులో మద్యాన్ని కొని.. దగ్గర్లోని స్థిరాస్తి వెంచర్ లోకి వెళ్లి తాగుతున్నాని.. ఆ సందర్భంగా తనను దారుణంగా తిట్టి దాడి చేశారన్నారు.
ముందు సీసాతో తన తల మీద కొట్టి గాయపర్చారని.. తర్వాత నిప్పు అంటించారని.. ఒళ్లంతా గాయాలయ్యాక తనను పత్తి చేలో పడేసి వెళ్లారని.. ఆ తర్వాత తాను స్ప్రహ కోల్పోయినట్లు చెబుతున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయానికి ఈ ఉదంతం ఒక నిలువెత్తు నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.