ఓవరాక్షన్; రకుల్ వస్తే రోడ్డు మూసేయాలా?

Update: 2015-07-29 19:06 GMT
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ రహదారి ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం వేళల కంటే సాయంత్రం నుంచి రాత్రి పది గంటల మధ్యలో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక.. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన దారి వెడల్పు తక్కువగా ఉండి.. ఏ మాత్రం పెద్ద వాహనాలు పక్కపక్కనే రెండు.. మూడు వస్తే చాలు ట్రాఫిక్ అల్లకల్లోలం అవుతుంది.

ఇలాంటి ప్రదేశాల్లో ఎవరైనా సెలబ్రిటీ వస్తుంటే పోలీసులు అనుమతి ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. ట్రాఫిక్ జాం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ.. తమ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రారంభమైన ఒక ప్రముఖ హోటల్ కోసం ఎస్ఆర్ నగర్ రహదారిని మూసేశారు. ఎందుకిలా అంటే.. సదరు ప్రముఖ హోటల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ టాలీవుడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ వస్తున్నారని.. అమ్మడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ ఓవరాక్షన్ చేశారు.

పీక్ అవర్స్ లో దాదాపు మూడు గంటల పాటు రోడ్డు మూసేయటంతో ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించటంతో పాటు.. మళ్లీ వెనక్కి వెళ్లి.. తమ దారిన తాము పోవాల్సిన పరిస్థితి. ఒక హోటల్ కోసం.. మరో సెల్రబిటీ ఇంతగా చేసిన పోలీసులు.. వేలాది మంది జనాల దృష్టి కోణంలో నుంచి ఎందుకు ఆలోచించరు?
Tags:    

Similar News