తిరుపతి ఎంపీ సీటును జనసేనకే బీజేపీ వదిలేస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీని తోసిరాజని పెద్దగా ఎదిగేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే టీడీపీ స్థానాన్ని ఆక్రమించే స్థాయిలో బీజేపీకి ఏపీలో పరిస్థితులు అనుకూలంగా రావడం లేవు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాకిచ్చేలా నిరాశపరిచాయి. బీజేపీ పరిస్థితిని ఏపీలో తేటతెల్లం చేశాయి.
బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులు కొన్ని సీట్లను గెలుపొందగలిగారు. అది కూడా జనసేన మద్దతుతోనే కావడం గమనార్హం. బీజేపీ గెలిచిన చాలా సీట్లు కాపు కమ్యూనిటీ ఆధిపత్య ప్రాంతాలలో.. జనసేన మద్దతుతో కావడం గమనార్హం. తిరుపతి ఉప ఎన్నికల్లో సీటు బీజేపీకి ఇవ్వాలా? లేదా జనసేనకు ఇవ్వాలా? అన్న సంశయానికి పంచాయతీ ఎన్నికలు క్లియర్ కట్ మెసేజ్ ను ఇచ్చాయి. తిరుపతి ఎంపీ సీటును జనసేనకే ఇవ్వాలన్న బలమైన వాదనకు ఈ పంచాయతీ ఎన్నికలు బలాన్ని ఇచ్చాయి.
పంచాయతీ ఎన్నికలలో బీజేపీ పర్మాఫెన్స్ చూశాక.. జనసేనకు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వడం సరైనదేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. "బిజెపి, జనసేన రెండు పార్టీలకు తిరుపతిలో అవకాశం లేదు. జనసేన ఓట్లు బదిలీ చేయకపోతే, బిజెపి డిపాజిట్ కూడా కోల్పోవచ్చు.
జనసేనకు సీటు ఇవ్వకపోతే స్థానిక బలిజా అసోసియేషన్ ఇప్పటికే నోటాకు ఓటు వేయాలని తీర్మానం చేసింది. కాబట్టి, జనసేనకు సీటును వదిలివేయాలని మేము ఆలోచిస్తున్నాము " అని బిజెపికి చెందిన ఒక వర్గం గట్టిగా చెబుతోందట..వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు మరణించి ఐదు నెలలకు పైగా అయ్యింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాలి. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని అంటున్నారు.