స్నేహం ముసుగులో ఓ బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం
దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. హత్రాస్ దళిత బాలికపై గ్యాంగ్ రేప్, ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం.. పెట్రోల్ పోసి నిప్పు లాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. స్నేహం ముసుగులో ముగ్గురు మైనర్లు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
జూబ్లీహిల్స్ కు చెందిన బాలికకు బర్త్ డే కేకులో మత్తు మందు ఇచ్చిన ముగ్గురు మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి దిగారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక విషయం బయటపెట్టింది. వారి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.