ఆరు నెలల్లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు మూడేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరు నెలల్లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీకి ఏపీ ప్రభుత్వం తాజాగా నివేదికను పంపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో రహదారి భద్రత ఉల్లంఘనలు పెద్దగా జరగలేదని పేర్కొంది. ఏపీలో మద్య నియంత్రణ.. రాత్రి 8 గంటల తర్వాత మద్యం బంద్ నేపథ్యంలోనే డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గిపోయాయని సుప్రీం కోర్టు కమిటీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
ఇక టోల్ గేట్లతోపాటు పాటు కూడళ్లలో బ్రీత్ ఎనలైజర్లతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడంతో కేసులు తగ్గిపోయాయని ఏపీ సర్కార్ తెలిపింది.
ఏపీలో గత ఆరు నెలల్లో నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో ఒకటి నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలో నమోదు కాలేదని తెలిపింది. గత ఏడాది ఇదే ఆరు నెలల్లో 2వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వివరించింది.
రాత్రి 8 గంటల తర్వాత ఏపీలో మద్యం అమ్మకాలు లేకపోవడం.. ఎక్కడా మద్యం దొరక్కపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.