మూడు రాజధానులు .. రేపటినుంచి హైకోర్టులో రోజువారీ విచారణ

Update: 2020-10-05 13:30 GMT
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఏర్పాటు చేయదలచిన మూడు రాజధానుల నిర్ణయం పై  సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాదాపు వంద పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధాని మార్పు అంశంపై ఇప్పటివరకు 229 అనుబంధ పిటిషన్లు రావడంతో, వాటిని అంశాల వారీగా విభజించి విచారణ చేపట్టాలని హైకోర్టు భావిస్తోంది. ఆ పిటిషన్లపై  రేపటి నుండిహైకోర్టు రోజువారీ విచారణ జరపబోతోంది. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో అమరావతి గ్రామాల రైతులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష పార్టీలు, అమరావతి ఉద్యమకారులు ఉన్నారు. వీరితో పాటు వివిద పార్టీలు కూడా తమ అభిప్రాయాలతో అఫిడవిట్లు దాఖలు చేశారు. రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు, హైకోర్టుకు శాశ్వత భవన నిర్మాణం, సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే ఆర్-5 జోన్, హైపవర్ కమిటీ, జీఎన్‌రావు కమిటీలపై వేసిన పిటిషన్ల పై కోర్టులో విచారణ జరుగనుంది

ఈ రోజు నుండి మూడు రాజధానుల నిర్ణయం పై వేసిన పిటిషన్ల రోజువారీ విచారణ జరగబోతున్నందున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే హైకోర్టు పిటిషనర్లతో పాటు ప్రతివాదులుగా ఉన్న వారికీ గతంలోనే సూచించింది. దీంతో ఆయా పార్టీలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం, గవర్నర్‌ సాయంతో ఆమోదించిన బిల్లులపై స్టేటస్‌ కో కొనసాగుతోంది. గవర్నర్‌ ఆమోదించిన ఈ బిల్లులు రాజ్యాంగబద్ధంగా రూపుదిద్దుకోలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ బిల్లుల వ్యవహారం హైకోర్టు విచారణలో కీలకంగా మారబోతోంది. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకోనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా మూడు రాజధానుల నిర్ణయం పై గతంలో కోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News