ప్రాణాలకు ముప్పు.. సుప్రీంలో కంగనా పిటీషన్

Update: 2021-03-02 12:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తనపై ముంబైలో నమోదైన 3 కేసులను హిమాచల్ ప్రదేశ్ కు బదిలీ చేయాలని కోర్టును కోరింది.

ముంబైలో కేసుల విచారణకు హాజరు కావడం తన ప్రాణానికి ముప్పు అని పేర్కొన్న కంగనా.. శివసేన నేతల నుంచి ప్రాణహాని ఉన్నందున బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

కాగా వివిధ కారణాలతో ముంబై మెట్రో పాలిటన్ కోర్టులో కంగనారౌనత్ పై 3 కేసులు నమోదయ్యాయి.

వివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్‌ సోషల్‌ మీడియా పోస్టులు, ఇంటర్యూలు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా సోదరులు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు.

 కోర్టు ఆదేశానుసారం.. దేశ ద్రోహం కేసులో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ముంబై పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. కంగనా వాంగ్మూలాన్ని బాంద్రా పోలీసులు నమోదు చేశారు.

ఇప్పటికే మహారాష్ట్రలోని శివసేన సర్కార్ తో కంగనా కయ్యం పెట్టుకుంది. ఢీ అంటే ఢీ అంది. ఆ సర్కార్ కూడా కంగనా కార్యాలయాలను కూల్చింది. అందుకే తనకు రక్షణ లేదని కేసులు మార్చాలని కంగనా సుప్రీంకోర్టుకు ఎక్కింది.
Tags:    

Similar News