ఈ ఏడాది కుంభమేళా 30 రోజులే..ఆ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి!

Update: 2021-02-18 17:30 GMT
హిందువులకు అత్యంత పరమ పవిత్ర క్రతువుగా భావించే కుంభ‌మేళాను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఓం ప్ర‌కాశ్ ఓ ప్రకటన లో వెల్లడించారు. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్చి చివ‌రి నాటికి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారమని, కానీ ఈ ఏడాది కరోనా వల్ల  కుంభమేళాను 30 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

 కుంభమేళాకు సంబంధించి కొద్దిరోజుల క్రితం హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ సి.రవిశంకర్ మాట్లాడుతూ .. పాసులు ఉన్న భక్తులనే మేళాకు అనుమతిస్తారని చెప్పారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగటివ్‌ గా తేలినవారికే పాసులు మంజూరు చేస్తారని తెలిపారు. పాసులు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు.

భారీ ఎత్తున జనం హాజరవుతారు కాబట్టి, కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉంటుందని, అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుంభమేళా వద్ద విధులు నిర్వహించబోయే సిబ్బంది కోసం 70వేల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్దం చేయాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కూడా సూచించినట్లు చెప్పారు. గంగా నది తీరం వెంబడి కెమెరాలను ఏర్పాటు చేసి భక్త జనసందోహాన్ని పర్యవేక్షిస్తామన్నారు

కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్ ‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. కుంభ పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు, భారతదేశంలోని నాలుగు ప్రదేశాల్లో అమృతాన్ని ధారపోశారు. అవే హరిద్వార్, ప్రయాగ్‌ రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఈ నాలుగు ప్రదేశాల్లో గ్రహాలను అనుసరించి కుంభమేళా జరుగుతోంది.

పురాణాల్లో చెప్పినట్లు ప్రయాగరాజ్‌లో త్రివేణీ సంగమ ప్రాంతంలో సరస్వతి నది అంతర్గతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. మూడు దశాబ్దాలుగా నాసాతో కలిసి భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో నది ఉన్నట్లు స్పష్టమైంది. అంతర్గతంగా ప్రవహిస్తున్న సరస్వతి నది మార్గంలోనే యమునా నది ప్రవహిస్తోందని నమ్మకం.
Tags:    

Similar News