వాళ్లకే ఈ ఊరోళ్లు ఓటేస్తారట..

Update: 2019-03-31 09:48 GMT
అది నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని శ్రీపురంధరపురం గ్రామం. 1970లో శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) ఏర్పాటు కోసం 200 గ్రామాలను ఖాళీ చేయించారు. వారి నష్టపరిహారం ఇచ్చారు. ఆ సమయంలో వీరి భూములు, నివాసాలు మొత్తం తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యామ్మాయంగా శ్రీపురంధరపురంలో స్థలాలను, భూములను కేటాయిస్తామని తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ తమకు న్యాయం జరగలేదని శ్రీపురంధరపురం గ్రామస్థులు పోరాడుతున్నారు..

2012 ఉప ఎన్నికల్లో శ్రీపురంధరపురం గ్రామస్థులు తమకు భూములు విషయంలో అన్యాయం జరిగిందని ఎన్నికలను బాయ్ కాట్ చేశారు. కానీ అప్పుడు రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కితగ్గారు. కానీ న్యాయం జరలేదు.  ఇప్పుడు 2019 ఎన్నికల వేళ కూడా అస్త్రం బయటకు తీశారు.  

తాము ఓట్లను అమ్ముకోమని.. జీవో నంబర్ 1024 ప్రకారం తమకు రావాల్సిన ఎకరా భూమి ఇప్పించగలిగిన వారికే మా మద్దతు అని గ్రామంలో ఫెక్సీ ఏర్పాటు చేశారు. పరిష్కరించకపోతే ఎన్నికలను బహిష్కరిద్దామని గ్రామస్థులు నిర్ణయం తీసుకోవడంతో ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలిసింది. వారు వెంటనే వచ్చి ఫ్లెక్సీ తొలగించారు. కానీ తమకు న్యాయం చేసే వారికే అండగా ఉంటామని.. ఓట్లు వేయమని గ్రామస్థులు భీష్మించుకు కూర్చున్నారు.
    

Tags:    

Similar News