రోటీన్ కు భిన్నం ఈ టీనేజర్.. దోమ కనిపిస్తే చేత్తో చంపేసి ఏం చేస్తుందంటే?
దోమ కనిపిస్తే ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు చాలామంది చాలా సమాధానాలు చెప్పొచ్చు. చంపిన తర్వాత ఏం చేస్తారు? అని అడిగితే మాత్రం కాస్త తేడాగా చూడటం ఖాయం. కానీ.. పందొమ్మిదేళ్ల శ్రేయ మహోపాత్ర మాత్రం అందుకు భిన్నం. ఢిల్లీకి చెందిన ఈ ఫ్యాషన్ కోర్సు చేస్తున్న ఈ యువతి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్. దోమల్ని చంపి ఫైల్ చేసే ఆమె తీరు అందరిని ఆకట్టుకునేలా చేయటమే కాదు.. వార్తల్లోకి వచ్చేలా చేసింది.
ఇంతకీ.. దోమలంటే ఆమెకు ఎందుకంత కోపం? మిగిలిన వారి మాదిరి కాయిల్సో.. బ్యాట్ తోనో కాకుండా చేతులతో ఎందుకు చంపేస్తుందంటే.. దాని వెనుక పెద్ద కారణమే ఉందంటారు. ఆమె పద్నాలుగేళ్ల వయసులో డెంగ్యూ బారిన పడ్డారు. అప్పట్లో ఆమె ఇంట్లో దోమలుఎక్కువగా ఉండేవి. ఎప్పుడైతే డెంగ్యూ బారిన పడి ఇబ్బంది పడిందో.. అప్పటి దోమల మీద విపరీతమైన పగను పెంచుకున్న ఆమె.. దోమ కనిపిస్తే చాలు.. దాన్ని చంపే వరకు నిద్రపోదు.
అంతేకాదు.. ప్లస్ టూ చదివే టైంలో దోమలు అదే పనిగా కుడుతూ.. ఆమె చదువును తెగ డిస్ట్రబ్ చేసేవి. దీంతో.. ఆమె వాటి మీద కోపం పెంచుకోవటమే కాదు.. మస్కిటో కిల్లర్ గా మారింది. చేతులతో దోమను చంపేయటమేకాదు. దాన్ని జాగ్రత్తగా ఒక నోట్ బుక్ లో అతికించి..దానికి నెంబరు వేసి మరీ రికార్డును మొయింటైన్ చేస్తుంది. దీని వల్ల లాభం ఏమిటంటే? అన్న ప్రశ్నకు సమాధానం ఏమి ఉండదు. కాకుంటే.. దోమల మీద ఆమెకున్న కోపాన్ని అలా తీర్చుకునేది.
తాను చంపేసిన దోమల్ని ఇలా రికార్డుమొయింటైన్ చేస్తుందన్న విషయం ఆమె ఇంట్లోని ఎవరికి తెలీదు. సోషల్ మీడియా పుణ్యమా అని.. తాను చేసిన పనిని షేర్ చేసుకోవటం.. అది కాస్తా వైరల్ గా మారిపోయింది. ఎంతలా అంటే.. ఆమె మొయింటైన్ చేస్తున్న చచ్చిన దోమల రికార్డు బుక్ ఫోటోకు ఏకంగా 110k లైకులు రావటం చూస్తే.. ఆమె పోస్టు ఎంత పాపులర్ అయ్యిందో ఇట్టే అర్థమవుతుంది. తన ఫోటోకు సైకోపాత్.. సీరియల్ కిల్లర్ అనే క్యాప్షన్ తో పోస్టు చేయటం అది పాపులర్ కావటంతో ఆమె వార్తల్లోకి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు. శ్రేయ కూడా అందుకు మినహాయింపు కాదు.