పవన్ కు తమిళ మీడియా తగిలించిన బిరుదు ఇదీ
పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియాలోనూ కథనాలు వెలువడడం ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ తర్వాత పొత్తులతో ఇప్పుడు బీజేపీ పంచన చేరారు. ఈ క్రమంలోనే రాజ్యాధికారం కాన్సెప్ట్ కనుమరుగై పొత్తుల సంసారంలో చిత్తు అవుతున్నారని.. ఈ క్రమంలోనే ఆయనను ‘గందరగోళవాది’గా తమిళ మీడియా పేర్కొంది. ఈ మేరకు పవన్ కు ఈ కొత్త బిరుదును తగిలించింది.
తమిళ సాయంకాల దినపత్రిక మురుసు తాజాగా పవన్ కళ్యాన్ పై ఓ కథనం ప్రచురించడం ఆసక్తి రేపుతోంది. 'గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదట భావించారు. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేతలు కలిశాక వారికి మద్దతునిచ్చి జీహెచ్ఎంసీలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటికే నామినేషన్లు దాఖలు చేసి దాదాపు 50 మందిని వాటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.' అని కథనంలో విమర్శించారు.
2014లోనూ పవన్ ఇలాగే బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతునిచ్చి అభాసుపాలయ్యారని ..2019లోనూ కమ్యూనిస్టులు, మాయవతితో పొత్తు పెట్టుకొని పోయారని.. ఇప్పుడు మళ్లీ బీజేపీ అంటున్నారని.. ఇదంతా చూస్తుంటే గందరగోళ రాజకీయ నేతగా కనిపిస్తున్నారని అక్కడి మీడియా ఆరోపించింది.
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో విప్లవ భావాలు,నాస్తికత్వం,బహుజనవాదం అంటూ మాట్లాడిన పవన్... ఆ తర్వాత పూర్తిగా కాషాయంలోకి మారిపోయారని తమిళ మీడియా ఆరోపించింది.. కుల,మత రాజకీయాలకు దూరమని ప్రకటించిన ఆయన... మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీతో స్నేహం చేస్తున్నారని విమర్శించింది.. ఏ స్టాండ్‌పై పవన్ ఎక్కువరోజులు నిలబడకపోవడం... అవసరానికి తగ్గట్లుగా సిద్దాంతాలను పక్కనపెట్టేయడం పవన్ విశ్వసనీయతను దెబ్బతీసిందని ఆ మీడియాలో కథనం ప్రచురించారు. ఇదిప్పుడు జనసేన వర్గాలకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.