టీడీపీ, జనసేన ఫ్రెండ్లీ ఫైట్.. ఇదిగో ఫ్రూఫ్

Update: 2019-03-21 10:13 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఖరారు వచ్చేసరికి సంచలన నిజాలు, ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఫ్రెండ్లీ ఫైట్ లో తాము బలిపశువును అయ్యానని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.

అల్లు భానుమతి మాట్లాడుతూ.. అమెరికాలో చదువుకుంటున్న తన మనవడికి టికెట్ ఇస్తామని ఆశచూపి పవన్ రప్పించారని..కానీ తీరా ముఖ్యమంత్రి ఆదేశించారనే ఒకే ఒక్క కారణంతో వేరే అభ్యర్థిని బరిలో దింపారని భానుమతి సంచలన ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం విశాఖ పట్నం జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలు అన్నాదమ్ములను బరిలోకి దించడం చూసి ఇప్పుడు ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. టీడీపీ నుంచి గవిరెడ్డి రామానాయుడు, జనసేన నుంచి ఆయన సోదరుడు గవిరెడ్డి సన్యాసినాయుడు పోటీచేస్తున్నారు.

నిజానికి మాడుగుల అసెంబ్లీ సీటుకు జనసేన అభ్యర్థిగా అల్లు భానుమతి మనవడు రఘురాజుకు దాదాపు ఖాయమని పవన్ కళ్యాణ్ పిలిపించారట.. కానీ ఇప్పుడు చంద్రబాబు చెప్పారనే కారణంతో సన్యాసి నాయుడుకు ఇచ్చేశారు. జనసేనాని పవన్ తన మనవడిని బలిపశువును చేశారని అల్లు భానుమతి సంచలన ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ ఫైట్ చూశాక జనసేన, టీడీపీ ఫ్రెండ్లీ ఫైట్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని.. దీని వెనుక పెద్ద కుట్రే ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
    

Tags:    

Similar News