వ్యాక్సిన్ వేయించుకున్న తొలి భారతీయ జంట వీరే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. బ్రిటన్ లో నిన్నటి(మంగళవారం) నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 90 ఏళ్ల బామ్మకు తొలి టీకా వేయటం తెలిసిందే. మొదటిరోజునే పలువురికి టీకా వేశారు. ఇలా టీకా వేయించుకున్న వారిలో భారతీయ జంట కూడా ఉన్నారు. ప్రపంచంలోని భారతీయుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి జంట వీరే కావటం గమనార్హం.
బ్రిటన్ కు చెందిన 87 ఏళ్ల హరిశుక్లా.. 83 ఏళ్ల రంజన్ నిలిచారు. న్యూక్యాజిల్ ఆసుపత్రిలో తొలి టీకాను వారు వేయించుకున్నారు. హరిశుక్లా పుట్టింది ఉగాండాలో అయనప్పటికి ఆయన తండ్రి ముంబయి నుంచి బతుకుదెరువు కోసం వెళ్లారు. 1974లో బ్రిటన్ కు చేరుకొని న్యూక్యాజిల్ లో స్థిరపడ్డారు.
టైన్ అండ్ వేర్ రేస్ ఈక్వాలిటీ కౌన్సిల్ లో డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన.. వివిధ వర్గాల ప్రజల మధ్య వైషమ్యాల్ని తొలగించటంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. బ్రిటన్ లో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డుల్లో మూడో అత్యున్నతమైన కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ అంపైర్ పురస్కారాన్ని పొందారు. కోవిడ్ మహమ్మారి అంతానికి సమయం దగ్గర పడినందుకు ఆనందంగా ఉందని ఈ జంట పేర్కొన్నారు.