దేశంలో అత్యంత సంపన్న మహిళలు వీరే.. కోటక్ తాజా నివేదిక

Update: 2020-12-04 03:40 GMT
కొత్త నివేదిక బయటకు వచ్చింది. దేశంలో అత్యంత ధనిక మహిళ ఎవరు? ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. అంతేకాదు.. మొదటి మూడు స్థానాల్లో ఉన్న ముగ్గురు మహిళలఆస్తులు కలిపితే ఏకంగా లక్ష కోట్ల రూపాయిలు దాటటం గమనార్హం. కోటక్ వెల్త్ - హురున్ ఇండియాలు సంయుక్తంగా ఒక నివేదికను తాజాగా విడుదల చేశారు. అందులో దేశంలోని అత్యంత సంపన్న మహిళల వివరాల్ని.. వారికున్న ఆస్తుల లెక్కను వెల్లడించారు.

ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్న మహిల రోష్ని నాడార్. ఆమె ఆస్తి అక్షరాల రూ.54,850 కోట్లు. రెండో స్థానంలో కిరణ్ మజుందార్ షా నిలిచారు. ఆమె సంపద రూ.36,600 కోట్లు. మూడో స్థానంలో లీనా గాంధీ తివారీగా నిలిచారు. ఆమె ఆస్తి విలువ రూ.21,340 కోట్లు. ఈ సెప్టెంబరు 30 నాటికి దేశంలోని సంపన్న మహిళల ఆస్తులు ఎంతన్న అంశాన్ని లెక్కించినప్పుడు.. టాప్ త్రీలో ఉన్న ముగ్గురు మహిళల ఆస్తి విలువ రూ.1.10లక్షల కోట్లుగా ఉండటం విశేషం.

దేశంలోని టాప్ 100 సంపన్న మహిళల సగటు సంపద రూ.2725 కోట్లుగా ఉన్నట్లు లెక్కలు వేశారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ప్రతి మహిళది ఒక్కో రకమైన విజయగాథగా అభివర్ణిస్తున్నారు. ఈ జాబితాను చూసి.. ఎంతోమంది మహిళలు ఉత్తేజితులై.. మరింత ఎదగటానికి.. సంపదను క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తారన్న ఆశాభావాన్ని నివేదిక రూపొందించిన హురున్ ఇండియా అభిప్రాయపడింది. ఈ నివేదికలోని టాప్ 10 సంపన్న మహిళల్లో ఒకరు తెలుగు వారు ఉండటం గమనార్హం.

టాప్ 10 సంపన్న మహిళలు.. వారి సంపద.. వారి కంపెనీలను చూస్తే..

స్థానం       పేరు                                         సంపద (కోట్లల్లో)       కంపెనీ పేరు
01.     రోషన్ని నాడార్ మల్హోత్రా                  రూ.54,850         హెచ్ సీఎల్ టెక్నాలజీస్
02.    కిరణ్ మజుందార్ షా                         రూ.36,600         బయోకాన్
03.    లీనా గాంధీ తివారీ                          రూ.21,340          యూఎస్ వీ
04.    నీలిమా మోటపర్తి                           రూ.18,620           దివీస్ లేబొరేటరీస్
05.     రాధా వెంబు                                  రూ.11,590            జోహో
06.     జయశ్రీ  ఉల్లాల్                             రూ.10,220           అరిస్టా నెట్ వర్క్స్
07.     రేణు ముంజాల్                              రూ.8,690             హీరో ఫిన్ కార్ప్
08.     మల్లిక చిరాయు అమిన్                  రూ.7,570             అలెంబిక్ ఫార్మా
09.     అను అఘా.. మెహెర్ పుదుంజీ        రూ.5,850             థెర్మాక్స్
10.      ఫల్గుణీ నాయర్ ఫ్యామిలీ                రూ.5,410              నైకా
Tags:    

Similar News