అక్కడ కోడి రూ.5వేల నుంచి రూ.10వేలు

Update: 2021-01-15 04:30 GMT
ఓవైపు దేశ మొత్తం బర్డ్ ఫ్లూ భయంతో కోళ్ల వ్యాపారులు వణుకుతున్నారు. ఎంతో ఇష్టంగా తినే చికెన్ ను టచ్ చేయటానికి సామాన్యులు భయపడిపోతున్నారు. బతికి ఉండే బలుసాకు తినొచ్చని.. ఇప్పుడు చికెన్ తినకుండే పోయేదేముందని.. దూరంగా ఉన్నోళ్లు కొందరైతే.. మరికొందరు చికెన్ కు బదులు.. మటన్.. ఫిష్ తినేస్తున్నోళ్లు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత సిత్రంగా ఉంది.

సంక్రాంతి పండుగ వేళ.. ఊళ్లల్లో కోడి పందాల్ని పెద్ద ఎత్తున నిర్వహించే విషయం తెలిసిందే. ఏడాది మొత్తం ఈ పందేల కోసం పుంజుల్ని విపరీతంగా ట్రైన్ చేయటమే తెలిసిందే. ఇందుకోసం జీడిపప్పు.. బాదంపప్పు.. పిస్తా పప్పు ఇలా ఖరీదైన ఆహారాన్ని పెడుతుంటారు. పందెం కోసం పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తుంటారు. ఇలా పందెంలో పాల్గొని ఓడిపోయిన కోళ్లను కొనుగోలు చేయటానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఓవైపు చికెన్ తినటానికి వణుకుతుంటే.. మరోవైపు పందెంలో ఓడిన కోడిని సొంతం చేసుకోవటానికి ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఓడిన కోడిని మామూలుగా అయితే రూ.3వేలకు సొంతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు పోటీ పెరిగిపోవటంతో ఇలా ఓడిన పుంజుల్ని సొంతం చేసుకోవటానికి వేలాది రూపాయిల్ని ఖర్చు చేయటానికైనా వెనుకాడటం లేదు.

గోదావరి జిల్లాల్లో పందెంలో ఓడిన కోళ్ల కోసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేయటానికి వెనుకాడటం లేదు. పందేల్లో అద్భుతంగా ఫెర్ ఫ్మామ్ చేసి.. ఏదైనా పోటీలో ఓడిన పుంజును సొంతం చేసుకోవటానికి భారీగా పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. ఓడిన పుంజును.. పోటీలు నిర్వహించిన దగ్గర్లోనే కాల్చేసి.. శుభ్రం చేసి ఇస్తున్నట్లు చెబుతున్నారు. కనుమరోజు కచ్ఛితంగా నాన్ వెజ్ తినే అలవాటు ఉండటంతో.. ఓడిన కోళ్లను సొంతం చేసుకోవటానికి భారీగా ఖర్చు చేయటం ఆసక్తికరంగా మారింది.బర్డ్ ఫ్లూ భయాలు పందెం కోళ్ల విషయంలో పట్టకపోవటం గమనార్హం.
Tags:    

Similar News